ఋషికొండ ప్యాలెస్ నిర్వహణ.. నెలకు రూ. 25 లక్షలు ప్రజాధనం వృధా

Publish Date:Jun 18, 2026

Advertisement

గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ..  సుమారు 452 కోట్ల రూపాయల భారీ ప్రజాధనంతో విశాఖలోని ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తెల్ల ఏనుగులా మారింది. ఈ భవనం వల్ల పైసా ఆదాయం రాకపోగా..  కేవలం దాని మెయింటెనెన్స్,  కరెంట్ బిల్లుల కోసమే నెలకు పాతిక లక్షల రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా ఈ ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తేల్చలేక ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.

ఈ ప్యాలెస్ కథ, దాని వెనుక ఉన్న అక్రమాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ..  ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు   6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో   ఈ నిర్మాణాన్ని పర్యాటకుల కోసమని, రాష్ట్రపతి లేదా కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు విడిది చేయడానికి నిర్మిస్తున్నామని కోర్టులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆయన..  వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి   జగన్ మోహన్ రెడ్డి తన సొంత నివాసం కోసం, విశాఖ నుండి పరిపాలన సాగించడం కోసమే దీన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్నారనేది బహిరంగ రహస్యమన్నారు.  ఇందులో ఏర్పాటు చేసిన లగ్జరీ బాత్‌టబ్‌లు, సముద్ర  అందాలు చూసేలా డిజైన్ చేసిన స్నానాల గదులు, ప్రత్యేక మసాజ్ రూమ్‌లు, కోట్ల విలువైన షాండ్లియర్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. 

ఈ ప్యాలెస్‌ను ప్రైవేట్ వ్యక్తులకు,  లగ్జరీ హోటల్స్ నిర్వాహకులకు లీజుకు ఇద్దామన్నా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి నివాసానికి సరిపోయేలా భారీ మీటింగ్ హాళ్లు, కేవలం 20 గదులతో నిర్మితమవడంతో వాణిజ్యపరంగా రన్ చేయడం కష్టంగా మారిందనీ,  ప్రముఖ హోటల్ సంస్థలు దీనిపై ఆసక్తి చూపించినప్పటికీ, వారు హోటల్‌గా మార్చడానికి అదనపు నిర్మాణాలు మరియు పక్కనే ఉన్న సిఆర్జెడ్  పరిధిలోని 7 ఎకరాల భూమిని అడుగుతున్నారు. వీటికి కేంద్ర పర్యావరణ అనుమతులు రావడం అంత సులువు కాదు. 

ప్రభుత్వం దీనిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికి పలుమార్లు సమావేశమైనా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయింది.  ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కాలయాపన చేయకుండా, ప్రభుత్వమే నేరుగా టూరిజం రిసార్ట్స్‌గా మార్చాలి. విశాఖకు వచ్చే అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, గూగుల్ వంటి సంస్థల సమావేశాల కోసం ఈ 20 గదులను, మీటింగ్ హాళ్లను రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయిస్తే నెలకు కనీసం 30 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని, తద్వారా నిర్వహణ భారం తప్పుతుందన్నారు.

ఈ భవన నిర్మాణానికి అక్రమంగా అనుమతులు ఇచ్చిన వారిపై, కోర్టులను తప్పుదోవ పట్టించిన అధికారులపై కూటమి ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని వృథా చేయకుండా త్వరితగతిన దీనిపై ఒక స్పష్టమైన పాలసీని తీసుకురావాలని అంకంరావు అన్నారు. 
 

By
en-us Political News

  
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.