22-ఏ సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ: మంత్రి పొంగులేటి

Publish Date:Oct 3, 2026

Advertisement

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ పట్టా భూములు నివాస వినియోగంలోకి మారినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు మార్గం సుగమం చేసింది. అర్హత ఉన్న భూములకు నాలా రుసుముతో పాటు నిబంధనల ప్రకారం ఇతర ప్రభుత్వ రుసుములు వసూలు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ మేరకు మెమో నంబర్ 48062/ULC/A1/2026 ద్వారా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

నాలా ప్రక్రియ పూర్తికాకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే నమోదై ఉన్న, 22-ఎ జాబితాలో చేరిన నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి చెప్పారు. దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, భూ హక్కులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.అర్హులైన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలతో పాటు అమలు పురోగతిపై నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి తమ సొంత ప్లాట్లను విక్రయించుకోలేక, వాటిపై రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.22-ఎకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల కోణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అధికారులు బాధ్యతాయుతంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

గత నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగా 22-ఎకు సంబంధించిన సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు పొంగులేటి తెలిపారు. 22-ఎ సమస్యల పరిష్కారంపై సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అనంతరం జీఓ 118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కూడా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ తాజాగా మెమో జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

 

 

[ 22-A Lands, 22-A Land Issues, NALA Process, NALA Charges, Land Problems, Patta Lands, Land Registrations, Ponguleti Srinivas Reddy, Telangana Government, Revenue Department, District Collectors, Land Rights, Urban Land Ceiling, GO 118, GO 76, Memo 48062/ULC/A1/2026, Revanth Reddy, Fast-Track Resolution ]

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.