శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో 20 మంది మహిళలు అరెస్టు.. ఎందుకంటే?

Publish Date:Jul 2, 2026

Advertisement

నకిలీ వీసాలతో గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 

గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం  20 మంది మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు  విమానం ఎక్కబోతుండగా  ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని  నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు. 

తనిఖీల్లో వారి వద్ద ఉన్నవి నకిలీ వీసాలని అధికారులు గుర్తించి ఈ చర్య తీసుకున్నారు. అనంతరం వీరిని ఎయిర్ పోర్టు ఔట్ పోస్టు పోలీసులకు అప్పగించారు.  ఇలా ఉండగా ఈ మహిళలంతా తాము ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లేందుకు ఒక ఏజెంట్ ను సంప్రదించామనీ, అతడు తమను మోసం చేశాడనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో   నకిలీ వీసాలను ఎవరు తయారు చేశారు? ఏ ట్రావెల్ ఏజెంట్ లేదా ముఠా వీరిని మోసం చేసింది? ఉద్యోగాల పేరుతో విదేశాలకు పంపించే అక్రమ రాకెట్ ఏదైనా పనిచేస్తుందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.  

By
en-us Political News

  
తండ్రి మరణవార్త తెలియగానే ఆమె కుమార్తె క్రాంతి.. తండ్రి కడసారి చూపు కోసం కీర్లంపూడిలోని నివాసానికి చేరుకోగానే అక్కడున్న వైసీపీ మద్దతుదారులు ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. క్రాంతికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ నూతన డ్యాష్‌బోర్డ్ ద్వారా సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల ప్రస్తుత లొకేషన్, వాటి యాజమాన్య వివరాలు, లోడ్ చేసిన సరకు, అందులోని మొత్తం సిబ్బందితో పాటు ప్రయాణించే మార్గం వంటి వివరాలు నిరంతరం అప్‌డేట్ అవుతుంటాయి. ముఖ్యంగా సదరు నౌక ఏ దేశ పతాకంతో ప్రయాణిస్తున్నప్పటికీ, అందులో పనిచేస్తున్న భారతీయుల క్షేమ సమాచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అలాగే అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి ఇబ్బందుల కూడా ఉంటే.. క్షణం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి సకాలంలో స్పందించడం అవసరమని చెబుతున్నారు.
గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు ఈ నెల 10న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం ఆయన కుడి భుజానికి సర్జరీ చేసింది.
259 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఆరంభంలో తడబడింది. రోకో (రోహిత్, కోహ్లీ) ఇద్దరూ విఫలమయ్యారు. అయితే స్కిప్పర్ శుభమన్ గిల్ కెప్టున్స ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 80 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా గిల్ కు మంచి సహకారాన్ని అందించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ రనౌట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.
అమెరికా దాడులకు దీటుగా.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కువైట్ లోని అలీ అల్ సలేం సైనిక విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణి, 5 క్రూయిజ్ క్షిపణులు, 33 అత్యాధునిక డ్రోన్లతో దాడికి పాల్పడింది.
మంటలు వేగంగా వ్యాపించి  చూస్తుండగానే ప్లాస్టిక్ మొత్తం కాలి బూడిదైంది.  నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో  ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఆధునీకరణ పనుల కోసం 12.56 కోట్ల నిధులను వెచ్చించింది. ఎన్ఎస్జీ 4 కేటగిరీకి చెందిన ఈ రైల్వే స్టేషన్, రాజధాని అమరావతి ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా కేంద్రంగా సేవలందించనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ స్టేషన్ రూపురేకలను పూర్తిగా మార్చేసింది.
భారతదేశ విద్యావ్యవస్థలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది.
పద్మనాభం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం..!
సోషల్ మీడియా ప్రపంచంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీగా మారిన నేతర్‌హాట్ బడి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.