Publish Date:Apr 25, 2025
అవినీతి అనగానే రాజకీయ నాయకులే గుర్తొస్తారు. అందులోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణ,అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అయ్యే పని కాదని అనుకుంటాము, కానీ, అది సంపూర్ణ సత్యం కాదు. రాజకీయ నాయకులలో ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరో నిజాయతీ పరులు ఉన్నట్లుగానే, ప్రభుత్వ అధికారులలోనూ, ప్రభుత్వ భూములను ఇతరత్రా భూమలను అక్రమంగా సొంత చేసుకోగల సమర్ధులు ఉంటారు.ఉన్నారు.అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి గ్రాఫ్’ కు పార్లర్’గా అవినీతి అధికారుల గ్రాఫ్’కూడా పెరుగుతోందని’ అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది.నిజానికి ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేరు అంటారు, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సార్ల భూదందా, అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే వుంది. సంచలనం అవుతోంది.
Publish Date:Apr 25, 2025
పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారు.
Publish Date:Apr 25, 2025
వక్ఫ్ సవరణ చట్టంను సమర్థిస్తూ మోదీ సర్కార్ సుప్రీంకోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది.
Publish Date:Apr 25, 2025
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్ తయారు చేసింది.వెలగపూడి సచివాలయం వెనక అమరావతి పునఃప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్‌షో కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Publish Date:Apr 25, 2025
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని తమ ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు ప్రధాని మోదీ, సీఎంచంద్రబాబుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. స్వారత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
Publish Date:Apr 25, 2025
వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్మలానీని వేధించిన కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్‌లో వేర్వేరు సెల్స్‌లో రిమాండ్‌లో ఉన్నారు.
Publish Date:Apr 25, 2025
జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి జేఎస్ చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ చంద్రమౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా.. భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కూటమి నేతలు కూడా చంద్రమౌళి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి. ఈ రోజు చంద్ర మౌళి పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృత దేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా ఆయన కుమార్తె తీవ్రంగా రోధించింది. బంధువులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు
Publish Date:Apr 25, 2025
భారత,పాకిస్థాన్ దేశాల మధ్య ఎప్పుడో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి చాలా చరిత్ర వుంది. నిజానికి ఉభయ దేశాల మధ్య యుద్దాలు, ఉద్రిక్తలు , సరిహద్దు ఘర్షణలు వంటి అనేక ఆటు పోట్లను ఎదుర్కుని ఇంతవరకూ సజీవంగా నిలిచిన ఒప్పందం ఏదైనా ఉందంటే అది 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ఒక్కటే.
Publish Date:Apr 25, 2025
వైసీపీ కీలక నాయకులు, వారి సన్నిహితులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వరుసగా కేసులు, అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్నికలు ముగియగానే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం తాజాగా రాజ్ కసిరెడ్డి, సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయుల వరకూ సాగింది. ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
Publish Date:Apr 25, 2025
ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు, చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కానీ నిందితులు ఎవరనేది ఇప్పటి వరకూ స్పష్టంగా కనిపెట్టలేకపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు.
Publish Date:Apr 25, 2025
మూఢ నమ్మకం ఓ చిన్నారి ఉసురు తీసింది. 11 ఏళ్ల బాలిక పూర్ణ చంద్రిక సొంత అమ్మ, అమ్మమ్మల మూఢ నమ్మకానికి బలైంది. ఈ సంఘటన విశాఖపట్నంలో గురువారం (ఏప్రిల్ 24) చోటు చేసుకుంది.
Publish Date:Apr 25, 2025
కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్ధులను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Publish Date:Apr 25, 2025
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచానట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో చైర్మన్ గా గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. అనంతరం 2003 నుంచి 2009 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అలాగే మోదీ సర్కార్ రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను తయారు చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు.