చైనా విస్తరణ కాంక్షకు వ్యతిరేకంగా ఏకమైన 14 దేశాలు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

ప్రపంచంలోనే   రెండో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉండి, నంబర్ వన్ స్థానం కోసం   పరితపిస్తున్న చైనాకు అంతర్జాతీయ వేదికపై ఊహించని భారీ షాక్ తగిలింది. దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించేందుకు చైనా చేస్తున్న  విస్తరణాకాంక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా  14  దేశాలు   ఏకతాటిపైకి వచ్చాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాలను తుంగలో తొక్కుతూ చైనా చేస్తున్న మిలిటరీ విన్యాసాలను నిలువరించేందుకు అమెరికా నాయకత్వంలో బలమైన ఫ్రంట్ సిద్ధమైంది. చైనా వాదనలకు ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదంటూ 14 దేశాల సంయుక్త ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో  పెను సంచలనంగా మారింది.  

 2016 జూన్ 12న నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరానికి చెందిన అంతర్జాతీయ న్యాయస్థానం  పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్  చైనా సముద్ర హక్కుల వాదనలను పూర్తిగా తప్పుబడుతూ   తీర్పు ఇచ్చింది. ఈ   తీర్పు వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలు చైనాను గట్టిగా నిలదీశాయి. అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, న్యూజిలాండ్, రొమేనియా, స్లోవేనియా వంటి 14 దేశాలు ముక్తకంఠంతో చైనా  అక్రమాలను ఖండించాయి. అంతర్జాతీయ చట్టం  ప్రకారం చైనా సముద్రంలో గీసుకున్న  నైన్-డాష్ లైన్ అబద్ధమని, దానికి ఎలాంటి విలువ లేదని ఈ దేశాలు స్పష్టం చేశాయి. 2016లో వచ్చిన పీసీఏ ఆర్బిట్రేషన్ అవార్డు అనేది చట్టబద్ధంగా ఇరు దేశాలను బంధించేలా ఉంటుందని, దీనిని చైనా   అమలు చేసి తీరాలని ఆ దేశాలు ఆ ఉమ్మడి ప్రకటనలో డిమాండ్ చేశాయి.

ఈ 14 దేశాల ఉమ్మడి కూటమికి  యూరోపియన్ యూనియన్  పూర్తి మద్దతును ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి బలవంతపు లేదా సైనిక చర్యలకు పాల్పడకూడదని ఈ ప్రకటనలో ఆ దేశాలు విస్పష్టంగా పేర్కొన్నాయి. నావిగేషన్,  ఓవర్‌ఫ్లైట్ స్వేచ్ఛను అంటే సముద్రాలు, ఆకాశ మార్గాల్లో అన్ని దేశాలకు ఉండే రాకపోకల హక్కులను కాపాడాలని స్పష్టం స్పష్టం చేశాయి.  ఈ అనూహ్య పరిణామంతో  అసహనానికి లోనైన చైనా.. బీజింగ్‌లోని జపాన్ ఎంబసీకి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను చైనా విదేశాంగ శాఖ నేరుగా పిలిపించి సమన్లు జారీ చేసింది. జపాన్ ఈ వివాదంతో నేరుగా సంబంధం లేని దేశమని, అయినప్పటికీ ఇతర దేశాలతో కలిసి ప్రాంతీయ శాంతి-స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని చైనా నిరసన వ్యక్తం చేసింది.

ఈ వివాదానికి అసలు కారణం దక్షిణ చైనా సముద్రానికి ఉన్న   వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత. ప్రపంచ వాణిజ్యానికి ఇది ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ప్రతి ఏటా కోట్ల రూపాయల విలువైన ముడి చమురు, సహజ వాయువు ఈ సముద్ర మార్గం గుండానే రవాణా అవుతాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో చైనా అక్రమంగా కృత్రిమ దీవులను నిర్మిస్తూ, వాటిని సైనిక స్థావరాలుగా మారుస్తోంది. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన  ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్  పరిధిలోకి చైనా యుద్ధ నౌకలు చొరబడుతూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నాయని ఫిలిప్పీన్స్   ఆరోపిస్తోంది.

ప్రస్తుతం అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళాలు ఈ ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షిస్తుండటం, మరోవైపు చైనా గస్తీ నౌకలు మోహరించడంతో ఈ సముద్ర ప్రాంతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. భవిష్యత్తులో ఈ 14 దేశాల కూటమికి, చైనాకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

China South China Sea Dispute, PCA Ruling Against China, US Japan Alliance, UNCLOS Sea Laws, Nine Dash Line China

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజకీయ పోరు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు కుటుంబం ఉదారత.. !
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.