అమ్మ ఒడికి 12 ష‌ర‌తులు.. ఎగ్గొట్ట‌డ‌మే జ‌గ‌నన్న‌ వ్యూహ‌మా?

Publish Date:Apr 15, 2022

Advertisement

మీ జిల్లా మారిందా? అయితే మీకు అమ్మ ఒడి రాక‌పోవ‌చ్చు. మీకు క‌రెంట్ బిల్లు ఎక్కువ వ‌స్తోందా? అయితే మీకు అమ్మ ఒడి ఇవ్వ‌రు?  మీ పిల్ల‌లు బంధువుల ఇంట్లో ఉంటున్నారా? అయితే, మీరు అమ్మ ఒడికి అన‌ర్హులు. ఆధారు కార్డు, బ్యాంక్ అకౌంట్‌, బియ్యం కార్డు.. ఇలా ఓ అర‌డ‌జ‌ను ష‌ర‌తులు పెట్టారు జ‌గ‌న‌న్న‌. అందులో ఏ ఒక్క‌టీ స‌రిగ్గా లేకున్నా.. ఏమాత్రం తేడా ఉన్నా.. మీకు ఇవ్వాల్సిన 15వేల‌ను ఎగ్గొట్టాల‌నేదే జ‌గ‌న్‌రెడ్డి స్కెచ్‌. ఆ మేర‌కు ప్ర‌భుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సాధ్య‌మైనంత మంది అర్హుల‌ను త‌గ్గించాల‌ని.. ఉన్న ల‌బ్దిదారుల‌ను తీసేయాల‌నే.. ఇలా త‌లాతోకా లేని ష‌ర‌తులు పెట్టారంటూ పేరెంట్స్ మండిప‌డుతున్నారు. డ‌బ్బులు లేక‌నే ఇలా కొత్త కండిష‌న్ల‌తో.. అమ్మ ఒడికి తూట్లు పొడిచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టికే ఓ అకాడ‌మిక్ ఇయ‌ర్‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా దాటేసిన జ‌గ‌న్ స‌ర్కారు.. ఈసారి కొత్త రూల్స్‌తో అస‌లుకే ఎస‌రు పెట్టే కుట్ర చేస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయినా, త‌గ్గేదేలే అంటూ జ‌గ‌న్ స‌ర్కారు అమ్మ ఒడి నిబంధ‌న‌ల‌ను క‌ఠిన త‌రం చేసేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ష‌ర‌తులు పాటించ‌కుండా ఎవ‌రైనా అమ్మ ఒడి డ‌బ్బులు తీసుకొని ఉంటే.. వారిపై క్రిమిన‌ల్ కేసులూ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. 

అధికారమే పరమావథిగా ఎంచి.. పాదయాత్ర సందర్భంగానూ, గత ఎన్నికల ప్రచారంలోనూ ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయానికి వచ్చేసరికి మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని నిబంధనలూ తుంగలో తొక్కి... కోర్టు అక్షింతలూ, మొట్టికాయలూ కూడా పట్టించుకోకుండా నిధుల మళ్లింపు ద్వారా హామీలు నెరవేర్చుకుంటున్నామని చెప్పుకోవడానికే అన్న చందంగా సంక్షేమ పథకాల అమలుతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే నియంత్రణ  లేని, క్రమశిక్షణ పాటించని కారణంగా.. ఇప్పుడు వాటి అమలు ప్రభుత్వం మెడకు గుదిబండగా మారింది. దాంతో పథకాల లబ్ధిదారుల్లో ‘కోతల’ విధానాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగానే అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల చట్రంలో బిగించేసింది. 

అందరికీ అందుబాటులోకి విద్య అన్నమహత్తర ఆశయం  అంటూ ఘనంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల చట్రంలో బిగించేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ఎత్తుగడకు జగన్ సర్కార్ తెర లేపింది.  ఒకటి కాదు...రెండు కాదు.. ఏకంగా 12 షరతులు విధించి వాటిని ఫుల్ ఫిల్ చేస్తేనే అమ్మ ఒడికి అర్హత లభిస్తుందని ఖరాఖండీగా తేల్చేసింది. పథకం ప్రారంభించినప్పుడు లేని షరతులు ఇప్పుడు కొత్తగా విధించడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించి.. తద్వారా భారం తగ్గించుకోవడమే తన ఉద్దేశమని జగన్ సర్కార్ చెప్పకనే చెప్పింది. 

ఆర్భాటంగా పథకాలు ప్రకటించడం.. అమలు చేయలేక కోతలు విధించడం వైకాపా సర్కార్ కు పరిపాటిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తాజాగా అమ్మఒడి పథకాన్ని ఆంక్షల చట్రంలో బిగించడమంటే లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించడమేనన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఇప్పటికే జనవరి నెలలో అమ్మల ఖాతాలో అమ్మ ఒడి పథకం కింద రూ. 14వేలు జమ కావల్సి ఉంది. వాస్తవంగా ఈ పథకం కింద లబ్ధిదారుల అక్కౌంట్ లో రూ.15వేలు జమకావాల్సి ఉన్నప్పటికీ  ఆయాల వేతనం కింద వెయ్యి రూపాయలు మినహాయించుకుంటున్న సంగతి విదితమే. కానీ దానిని జులైకి వాయిదా వేసింది. అంటూ దాదాపు ఏడు నెలలు ఎగనామం పెట్టినట్లే అంటే ఒక విద్యా సంవత్సరం అమ్మఒడి నిధులు జమ కాలేదనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా  విధించిన డజను షరతుల ఉద్దేశం ఒక అంచనా ప్రకారం పాతిక శాతం మంది లబ్ధిదారులను తగ్గించుకోవడమే. 

ఇందు కోసం జగన్ సర్కార్ విధించిన షరతులలో కొన్ని ఇప్పటికిప్పుడు పూర్తి చేయడం దాదాపు అసాధ్యమన్న భావన ఏర్పడుతోంది. కొత్తజిల్లాల వారీగా ఆధార్ కార్డును మార్పించుకోవడం, ఆధార్ బ్యాంకు అక్కౌంట్ అనుసంధానం, 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడకం వంటి షరతులు లబ్ధిదారుల్లో అయోమయాన్ని నింపడానికేనన్న విమర్శలు వినవస్తున్నాయి. అలాగే  కొత్త బియ్యం కార్డు, బ్యాంకు తదితర వివరాలన్నీ వలంటీర్ వద్ద ఈ వివరాలన్నీ తనిఖీ చేయించుకోవడం వంటి షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో కోతే ప్రభుత్వ లక్ష్యం అన్నది తేటతెల్లమౌతున్నది. తల్లి, విద్యార్థి ఒకే ఇంట్లో ఉండాలి, బ్యాంకు అక్కౌంట్ రన్నింగ్ లో ఉండాలి, ఆదాయపన్ను చెల్లింపు దారులు అనర్హులు వంటి షరతులు, వీటిలో ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయినా... సదరు లబ్ధిదారు అమ్మ ఒడికి అనర్హతే. ఈ షరతులన్నీ పూర్తి చేసినా...ఇంటింటి సర్వే మ్యాప్ లో  తల్లి, బిడ్డ ఒకే మ్యాపింగ్ లో ఉండాలి. అలాగే ఈ వివరాలన్నీ వలంటీర్ తో లబ్ధిదారే వలంటీర్ వద్ద తనిఖీ చేయించుకుని సరిచూసుకోవాలి. ఈ నిబంధనలన్నీ లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించి ప్రభుత్వం భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా విధించినవేనన్న విపక్షాల విమర్శలు చేస్తున్నాయి.

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.