ఆపద ఏదైనా జస్ట్ డయల్ 112.!

Publish Date:Aug 5, 2026

Advertisement

రోడ్డు ప్రమాదం, . అగ్ని ప్రమాదం చోటుచేసు కుంది.. ఎక్కడో హత్య జరిగింది.. గొడవ జరుగుతోంది.. దోపిడీ, దాడి,  వేధింపులు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో   ఏ నంబర్‌కు ఫోన్‌  చేసి సాయం అడగాలని ఆలోచించనవసరం లేదు. ఏ ఆపదకు ఏ నంబర్ కు ఫోన్ చేయాలన్న వెతుకులాట అవసరం లేదు.  పరిస్థితి ఏదైనా, ప్రమాదం ఏదైనా  సరే..జస్ట్ 112 నంబర్ కు ఫోన్ చేస్తే చాలు.  రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలను మరింత వేగవంతంగా, సమన్వయంతో అందించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ కొత్త  ఎమర్జెన్సీ రెస్పాన్స్  వ్యవస్థను అందుబాటు లోకి తీసుకొచ్చింది.

ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 

రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు వైద్య సహాయం అవసర మైతే అంబులెన్స్‌కు సమాచారం చేరుతుంది. అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. హత్య, దాడి, దోపిడీ, గొడవలు, మహి ళలు  ఇతరులపై వేధింపులు వంటి ఘటనల్లో సమీపంలోని పోలీసు బృందాలకు సమాచారం చేరవేస్తారు. అంటే ప్రజలు ఏ శాఖకు ఫోన్‌ చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 112 నంబర్ కు డయల్ చేసి  సమాచారం అందిస్తే చాలు.. అవసర మైన సేవలను సంబంధిత విభాగాలు సమన్వయం తో అందిస్తాయి.

112కు ఫోన్‌ వచ్చిన వెంటనే ఆ కాల్‌ను తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. కాల్‌ చేసిన వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు అత్యవసర పరిస్థితి ఏమిటో తెలుసుకుని, ఆ సమాచారాన్ని సమీపంలోని పోలీసు బృందాలకు చేరవేస్తారు. దీంతో ఘటనా స్థలానికి సహాయక బృందా లను వీలైనంత త్వరగా పంపించే అవకాశం ఉంటుంది. కొన్ని అత్యవ సర ఘటనల్లో ఒకే శాఖ సేవలు సరిపోని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులతో పాటు అంబులెన్స్‌ అవసరం కావచ్చు. అగ్ని ప్రమాదం లో ఫైర్‌ సిబ్బందితో పాటు పోలీసుల సహాయం కూడా అవసరం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో 112 ద్వారా అందిన సమాచా రాన్ని బట్టి సంబంధిత అత్యవసర స్పందన వ్యవస్థలను సమన్వయం చేస్తారు.

రాష్ట్రంలో ఈ సమీకృత అత్యవసర స్పందన వ్యవస్థను డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు. ఇప్పటివరకు వేర్వేరుగా కొనసాగుతున్న అత్యవసర స్పందన వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రజలకు వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్‌ శాఖ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు పోలీసుల నంబర్‌ ఏంటి, అంబులెన్స్‌ నంబర్‌ ఏంటి, ఫైర్‌ సర్వీస్‌కు ఎలా సమాచా రం ఇవ్వాలి అంటూ అయోమయపడాల్సిన అవసరం ఇక ఉండదు.  ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా 112కు కాల్‌ చేస్తే సంబంధిత సేవలను సమన్వయం చేసి సహాయం అందించేలా కొత్త వ్యవస్థ పనిచేయనుంది.  

112 emergency number india, ERSS helpline telugu, all in one emergency service, 112 india app sos, emergency response support system, single emergency helpline

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.