బొత్స అలక తీరింది.. టెన్త్ ఫలితాలు వెలువడ్డాయి!
Publish Date:Jun 6, 2022
Advertisement
బొత్స అలక తీరింది. దీంతో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో, వారి తల్లిదండుల్లో టెన్షన్ పోయింది. ఎట్టకేలకు టెన్త్ పరీక్షలు వెలువడ్డాయి. విద్యాశాఖ మంత్రి హోదాలో బొత్స సత్యన్నారాయణ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 797 పాఠశాలలు సెంట్ పర్సంట్ రిజల్ట్స్ సాధించాయి. ఫలితాలలో బాలురుతో పోలిస్తే బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 70.70కాగా బాలురలో అది 64.02శాతంగా ఉంది.78.3శాతం ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 49.7శాతం ఉత్తీర్ణతతో అనంతపురంజిల్లా చివరి స్థానంలో నిలిచింది. 71 పాఠశాలలు జీరో ఉత్తీర్ణత సాధించాయి. టెన్త్ పరీక్షలకు మొత్తం ఆరు లక్షల 2 వేల 537 మంది హాజరు కాగా 4లక్షల14వేల 281మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే మొత్తంఉత్తీర్ణత 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను www.results.bse.ap.gov.inలో చూడవచ్చు. గత ఏడాదిలొ పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత తగ్గడానికి కరోనానే కారణమని మంత్రి బొత్స అన్నారు. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగలేదన్నారు. అందుకే ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సప్లిమెంటరీ పరీక్ష నెల రోజుల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేపర్ జిరాక్స్ కాపీని రీ వెరిఫికేషన్‌కు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే నెల 5నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆయన ఈ నెల 13 నుంచి ఫెయిల్ అయిన విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/10th-exam-results-released-25-137125.html





