ఒకే రోజు 105 శంకుస్థాపనలు

Publish Date:Mar 9, 2025

Advertisement

చరిత్ర స‌ృష్టించనున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఆ పేరు చెప్తేనే వైసీపీ నేతలు ఉలిక్కిపడతారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అసమ్మతి బావుట ఎగురవేసి, అప్పుడే వైసీపీ పతనానికి బీజం వేశారాయన. ఎన్నికలకు ముందు వరకూ వైసీపీపై ఓ రేంజ్ లో విమర్శలు వినిపించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధే ఎజెండాగా పెట్టుకుని తన అసెంబ్లీ సెగ్మెంట్లో తన పని తాను సైలెంట్‌గా చేసుకుని పోతున్నారు. నియోజకవర్గంల్లో కార్యకర్తలను ఆప్యాయంగా పలంకరించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కావాల్సిన చర్యలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆయన దేశంలోనే రికార్డు సృష్టించబోతున్నారు. 

దేశ చరిత్రలో ఎపుడు జరగని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోమవారం (మార్చి 10) ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు. మరో వారం రోజుల్లో ఇంకో 198 అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. మొత్తం 303 అభివృద్ధి పనుల్ని 60 రోజుల్లో పనులు పూర్తి చేసి, మే 20న ప్రజలకు అంకితం చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 303 పనులకు గాను రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్‌ సెగ్మెంట్లో రూ. 191 కోట్ల అభివృద్ధి పనులు జరగడం విశేషం. 

ప్రస్తుతం రికార్డు స్థాయిలో చేపట్టనున్న 105 పనులను ఎక్కడికక్కడ ప్రజలే ప్రారంభించనున్నారు. కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే నాయకుడు బాగుంటాడు అని నమ్మే వ్యక్తి అయిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, అభివృద్ది పనుల్లో కార్యకర్తలను భాగస్వాముల్ని చేస్తున్నారు. శంకుస్థాపన చేయనున్న వాటిలో 303 పనులను పార్టీ జెండా  మోసిన 606 మంది కార్యకర్తలకు కట్టబెట్టి లీడర్‌గా తన నిబద్ధత చాటుకుంటున్నారు.

By
en-us Political News

  
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.