Publish Date:Aug 11, 2022
తెలంగాణ కేబినెట్ భేటీ లో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.తాజాగా అదనంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణ యించింది. కొత్తవి,. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగష్టు11) నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్ష న్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు.
దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఇక స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్. టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అలాగే కోఠి ఈఎన్టి ఆస్పత్రి లో అధునా తన సౌకర్యాలతో టవర్ నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌక ర్యాలతో కూడిన నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు మంత్రులు ప్రతిపాదనలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/10-lakh-new-pensions-grantedts-cabinet-25-141778.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.