Publish Date:Apr 27, 2022
అదో కంపెనీ. మూడేళ్లలోనే.. 23 లక్షల నుంచి 1,764 కోట్లకు చేరింది. అదేంటి.. ఇంత తక్కువ టైమ్‌లో అంత భారీ సంపద ఎలా వచ్చింది? అనే అనుమానం వచ్చింది జీఎస్టీ అధికారులకు. ఎందుకైనా మంచిదని ఆ కంపెనీ కార్యాలయంపై తనిఖీకి వెళ్లారు ఆఫీసర్లు. ఎంత వెతికినా అక్కడ ఏమీ దొరకలేదు. తిరిగి వెళ్లిపోతుండగా.. ఓ చిన్న డౌట్. అంతే. తీగ లాగకుండానే భారీ డొంక కదిలింది. 10 కోట్ల సొత్తు దొరికింది. ఇంతకీ ఏం జరిగిందంటే....
ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా కట్టల కొద్దీ నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో సీక్రెట్‌గా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చెందిన ఆఫీస్ నేలలో, గోడలో సెట్ చేసిన సీక్రెట్ అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించిన మహారాష్ట్ర జీఎస్‌టీ అధికారులు ఆ క్రమంలో చాముండా బులియన్ టర్నోవర్ గత మూడేళ్లలో రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరగడాన్ని గుర్తించారు. ముంబైలో మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేశారు. కల్బాదేవిలో 35 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఉన్న ఆఫీసులో ఏమీ లభించలేదు. అయితే, ఆ రూమ్ ఫ్లోరింగ్‌లో ఓ మూలన ఉన్న ఒక టైల్స్‌పై అధికారులకు అనుమానం వచ్చింది. ఆ టైల్స్ తొలగించి చూడగా.. నగదు సంచులు బయటపడ్డాయి. ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. ఐటీ సిబ్బంది వచ్చి గదిని మరింత నిశితంగా పరిశీలించి.. గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులో నుంచీ ప్యాక్ చేసి ఉన్న నగదు సంచులు బయటపడ్డాయి. సోదాల్లో రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభించాయి. మొత్తం సొత్తుతో సహా ఆ గది సీజ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/10-crores-seazed-in-secret-room-25-135071.html
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.