హస్తినలో కాళ్ల బేరం.. ఏపీలో విమర్శల సమరం

Publish Date:Jul 30, 2023

Advertisement

తప్పును తప్పు అని చెప్పడం.. పెద్ద తప్పైపోయినట్లు తయారైంది అధికార వైసీపీ నేతలకు అన్న    చర్చ అయితే ఏపీ పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్ గద్దెనెక్కిన తర్వాత.. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది?... ఎంత మందికి సంక్షేమం చేరిందంటే ఆలోచించాల్సిందేనని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు. 

అలాంటి వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం  జోనల్ సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వ విధి విధానాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్‌గా చేసుకొని వైసీపీ కీలక నేత  విజయ్ సాయిరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతే.. ఇక రాష్ట్ర   మంత్రి ఆర్కే రోజా మీడియా సాక్షిగా.. అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జీ వైవీ సుబ్బారెడ్డి...   ఒకే రోజు.. అలాగే   ఒకే విధమైన ఆరోపణలు గుప్పించారు. అదీ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా విమర్శలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు...వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? అని పేర్కొన్నారు.   

ఇక పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం  వస్తోందని మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లు ఏం మాట్లాడుతారో పురంధేశ్వరి కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. పురందేశ్వరీ విభజన హామీలపై పోరాడితే బాగుంటుందని  రోజా హితవు పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిఫ్ట్ చదువుతున్నారని అనుమానంగా ఉందని విశాఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పురందేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి కూడా మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. 

ఇక పురందేశ్వరీ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మీద పురందేశ్వరి కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు దాచి పెట్టాల్సిన పని ఏమీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అన్ని విధాలా బీజేపీకి మద్దతిస్తున్నామని ఆయన  ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 మొత్తం మీద కేంద్రంలో బీజేపీకి అడగకుండానే మద్దతు ప్రకటిస్తున్న వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో బీజేపీ నేతలు నోరెత్తితేనే ఉలికిపాటుకు గురౌతున్నారని అర్ధమౌతోంది. కేంద్రంలో కాళ్ల బేరం రాష్ట్రంలో విమర్శల సమరం అన్నట్లుగా వైసీపీ తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.