చంద్రబాబు సవాల్.. జగన్ స్పందన ఎలా ఉంటుందో మరి!?

Publish Date:Nov 15, 2024

Advertisement

అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అవాస్తవాలు చెబుతోందనీ, తప్పుడు ప్రచారం చేస్తోందనీ జగన్ మీడియా సమావేశంలో  చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు అలాంటి అనుమానాలేమైనా ఉంటే అసెంబ్లీకి వస్తే రికార్డులతో సహా వివరిస్తామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో  విపక్ష హోదా మంకుపట్టు వదిలేసి జగన్ అసెంబ్లీకి రావడానికి దీనినో ఆహ్వానంగా భావించొచ్చు.

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల  రూపాయలు అప్పు చేసిందని లెక్కలతో సహా వివరించారు. తాను చెప్పింది అవాస్తవమని భావిస్తే జగన్ అసెంబ్లీకి వచచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. నిజంగానే జగన్ తన హయాంలో  అప్పుల లెక్కలను చంద్రబాబు తప్పుగా ప్రచారం చేస్తున్నారని భావిస్తే ఆ విషయం అసెంబ్లీకి వచ్చి చెప్పడానికి ఇది మంచి అవకాశం.  ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా సవాల్ చేశారు కనుక జగన్ వస్తే ఆయనకు తప్పని సరిగా మైక్ ఇస్తారు. అప్పుడు జగన్ తన వాదనను గట్టిగా అసెంబ్లీ వేదికగా వినిపించే అవకాశం ఉంటుంది.

 అయితే జగన్ వాస్తవాలను చెప్పేందుకు కానీ, అంగీకరించేందుకు కానీ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ బయట అవాస్తవాలు మాట్లాడి, తన సొంత మీడియా, సొంత సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసుకున్నంత సులువు కాదు. అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పి తప్పించుకోవడం. ఎందుకంటే  చంద్రబాబైనా, జగన్ అయినా అప్పులపై తప్పుడు లెక్కలు చెబితే.. అప్పటికప్పుడు నిజాలను నిగ్గుతీసి వాస్తవాలను వెల్లడించడానికి వీలుగా రికార్డులు అందుబాటులో ఉంటాయి. అందుకే ఎంతటి వారైనా అసెంబ్లీ వేదికగా అడ్డదిడ్డంగా లెక్కలు ఇవీ అంటూ చెప్పడానికి వీలు ఉండదు. ఏ పద్దు కింద ఎంత అప్పు చేశారు. ఏ అవసరం కోసం చేసిన అప్పు ఏ అవసరం కోసం వాడారు. నిధుల మల్లింపు ఎలా చేశారు. అడ్డగోలుగా ఆస్తలను తాకట్టు పెట్టి మరీ ఎక్కడెక్కడ నుంచి అప్పులు తెచ్చారు అన్న అన్ని విషయాలూ రికార్డులను ముందు పెట్టి మరీ కడిగేయడానికి అధికార పక్షానికి ఎంత అవకాశం ఉందో.. ప్రతిపక్ష హోదా లేకపోయినా.. విపక్ష వైసీపీకి కూడా అంతే అవకాశం ఉంటుంది.

అందుకే  జగన్ అసెంబ్లీకి ముఖం చాటేసి తన సొంత మీడియాలో ప్రకటనలకే పరిమితమౌతున్నారు. నిజంగా జగన్ తన హయాంలో అప్పుల విషయంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పిన విషయాలు  అవాస్తవాలు అయితే ఆ విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ ఆయనకు మైక్ ఇవ్వకపోతే చంద్రబాబు చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని బయటకు వచ్చి జగన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తే జనంఆయన మాటల్లో నిజం ఉందని నమ్మే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకు తోచింది నేను అసెంబ్లీ బయటే మాట్లాడతాను అని భీష్మించుకుంటే అంతంత మాత్రంగా ఉన్న విశ్వసనీయతను కూడా జగన్ కోల్పోక తప్పదు.  

By
en-us Political News

  
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.