ప్రశ్నపత్రాల లీకేజీలు...పాలకుల వైఫల్యమా, వ్యవస్థ లోపమా?

Publish Date:Jun 4, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలు, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష వ్యవహారం దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల నిజమైన ప్రతిభావంతులు నష్టపోతుండగా, అక్రమ మార్గాల్లో పేపర్లు సంపాదించిన వారికి ప్రయోజనం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్య, వైద్యం ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని చర్చలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు బాధ్యత స్వీకరించాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం తప్పులను అంగీకరించకుండా విమర్శకులపైనే ఎదురుదాడికి దిగుతున్నారని పేర్కొన్నారు.

విద్యా సంస్థలు ర్యాంకులు, ఐఐటీ సీట్ల సంఖ్యలను ప్రచారం చేస్తూ మార్కెటింగ్‌పై దృష్టి పెడుతున్నాయని, కానీ మిగిలిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఎవ్వరూ చర్చించడం లేదని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. సాంకేతిక పరికరాల సహాయంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని, దీనివల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.

సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయని చర్చలో ప్రస్తావించారు. సరైన సన్నాహకాలు లేకుండా కొత్త విధానాలను అమలు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన వారిని ప్రోత్సహించి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, వారిని దేశద్రోహులుగా లేదా విదేశీ ఏజెంట్లుగా ముద్రవేసే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రధాన స్రవంతి మీడియా కూడా ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

ఈ పరిస్థితులు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని, విద్యార్థులు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి రానున్న రోజుల్లో రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే విద్యా రంగంలో పారదర్శకత పెంచడం, అవినీతిని అరికట్టడం, తప్పులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని సూచించారు.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయకపోతే దాని ప్రభావం కేవలం విద్యార్థులపైనే కాకుండా దేశ భవిష్యత్తుపై కూడా పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పాలకులు రాజకీయాలకు అతీతంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.


 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.