గురి తప్పని గుంటూరు బుల్లెట్ ముఖేష్!

Publish Date:Apr 8, 2026

Advertisement

భారత షూటింగ్ రంగంలోకి గుంటూరు బుల్లెట్ దూసుకు వచ్చింది. ఔను తెలుగుతేజం.. గుంటూరు జిల్లాకు చెందిన నేలవల్లి ముఖేష్ తన అద్భుత షూటింగ్ ప్రతిభతో అంతర్జాతీయంగా పతకాల వేట సాగిస్తున్నాడు.  షూటింగ్   ఖరీదైన క్రీడ..    ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే  గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు. 

షూటింగ్ లో ముఖేష్ ఆసక్తి చిన్నతనం నుంచే ప్రస్ఫుటమైంది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఒక సమ్మర్ క్యాంప్ లో షూటింగ్ లో కోచింగ్ తీసుకున్నాడు. గుంటూరులోని ఇండియన్ షూటింగ్ అకాడమీలో కోచ్ సుబ్రమణ్యం వద్ద   ముకేశ్ ను షూటింగ్ లో ఓనమాలు నేర్పారు.  ఆయన శిష్యరికంలో రాటు దేలిన ముఖేష్ పిస్టల్  షూటింగ్ విభాగంలో విభాగంలో తనదైన శైలిని అలవర్చుకున్నారు.  2017లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సీనియర్ షూటర్లకు గట్టి పోటీనిచ్చి విజేతగా నిలవడంతో ముఖేష్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది జాతీయ స్థాయిలోనూ కాంస్యం సాధించిన ముఖేష్ కు ఇక ఆ తరువాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.  

స్థానికంగా సరైన వసతులు లేనప్పటికీ  తనషూటింగ్ ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న ముఖేష్..  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి షూటింగ్ రేంజ్‌లో కఠిన శిక్షణ తీసుకున్నాడు. దీంతొ 2024 పెరూలోని లిమాలో  జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో  పాతిక మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణపతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఇదే టోర్నీలో ముఖేష్ మరో రెండు కాంస్య పతకాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.  

ఇక అక్కడ నుంచి మొదలైన ముఖేష్ పతకాల వేట..  ఢిల్లీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో స్వర్ణ, రజత పతకాలను గెలుచుకోవడం, ఆ తరువాత  జర్మనీ వేదికగా జరిగిన పోటీల్లోనూ కాంస్యం దక్కించునే వరకూ వెళ్లింది. ఆలా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని షూటర్ గా ముఖేష్ ఎదుగుతున్నారు. ప్రస్తతం  జూనియర్ విభాగంలో అగ్రశ్రేణి షూటర్‌గా రాణిస్తున్న ముకేశ్.. ముందుముందు  సీనియర్ కేటగిరీలోనూ ఇదే జోరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఒలింపిక్ పతకం అందుకోవడమే తన లక్ష్యం, ధ్యేయం ఆశయం అని చెబుతున్నాడు.  ఆత్మవిశ్వాసానికి ఆరడుగుల చిరునామాగా నిలుస్తున్న ముఖేష్ తన ఆశయం సాధిస్తాడని ఆశిద్దాం.

By
en-us Political News

  
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నాగరాజు ఈ కేసులో నాగరాజు పాత్ర ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మొదలైన నాగరాజు విచారణ దాదాపు రాత్రి అంతా సాగినట్లు తెలుస్తోంది.
బాధితురాలైన వైద్య విద్యార్థిని తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అభిషేక్ పోరెల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఆయన రాజీనామాను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అయితే ఆయన వచ్చే నెల 20 వరకూ విధుల్లో కొనసాగుతారు.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయనీ, వీటి ప్రభావంతో ఈ నెల 20 వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30వ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాల రాకతో ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో స్వల్పంగా మొదలైన మంటలు వేగంగా అక్కడి తాత్కాలిక గుడిసెలు, షెడ్లకు వ్యాపించాయి.
కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి ఏకపక్ష సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ యూఎస్ సెనేట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ సరిహద్దుల వద్ద మోహరించిన అమెరికా సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.