కేసీఆర్ ఉత్తుత్తి వాగ్దానాలు!
Publish Date:Apr 2, 2014
Advertisement
కేసీఆర్‌కి ఎవరైనా సాంస్కృతిక సంస్థల వాళ్ళు బిరుదు ఇవ్వదలుచుకుంటే ‘వాగ్దాన కర్ణుడు’ అని ఇస్తే బెటర్. ఎందుకంటే వాగ్దానాలు చేయడంలో ఈ సారుని మించిన దిట్ట భారత రాజకీయాల్లోనే ఉండరేమో. అలాగే ఇచ్చిన మాటని తప్పడంలో కూడా కేసీఆర్ గారు ఏనాడో డాక్టరేట్ చేసేశారు. లేటెస్ట్ గా మెదక్ జిల్లా జోగిపేటలో అయ్యగారు చేసిన వాగ్దానాల లిస్టు చూస్తే పెద్దపెద్ద ఆర్థికవేత్తలకైనా కళ్ళుతిరిగి స్పృహ తప్పి పడిపోతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవగానే ఆకాశంలోంచి అక్షయ పాత్రలాంటిదేమైనా ఊడి కేసీఆర్ తలమీదగానీ పడుతుందా అనే సందేహాలు కూడా పుట్టుకొస్తాయి. తాజాగా కేసీఆర్ చేసిన అమలుకాని వాగ్దానాల లిస్టు పరిశీలిద్దాం. 1 – గత సర్కారు అక్రమాలపై విచారణ.
2 – అధికారంలోకి వచ్చిన నెలలోనే రైతు రుణాల రద్దు.
3 – గృహ నిర్మాణ రుణాలు కూడా రద్దు.
4 – ఎవరూ ప్రభుత్వం దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
5 – తెలంగాణ వస్తే లక్షా 25 వేల ఉద్యోగాలు వస్తాయి.
6 – మా ప్రభుత్వంలో రూపాయి అవినీతి కూడా జరగదు.
7 – అవినీతికి పాల్పడితే కన్నవారిని కూడా జైలుకు పంపిస్తా.
8 – సింగూర్ జలాలను రైతుల సేద్యానికి ఇప్పిస్తా.
9 – పేదలకు సంవత్సరానికి మూడు వేల కోట్లతో పిల్లర్లతో ఇళ్ళు నిర్మిస్తాం.
10 – పోలీసు కుటుంబాలకు ఇళ్ళస్థలాలిస్తాం.
11 – రాబోయే మూడేళ్ళలో 13 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తాం.
12 – 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం.
13 – ప్రతి జిల్లాలో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తాం.
14 – తెలంగాణ ఉద్యోగులను చీటికి మాటికి బదిలీ చేయం.
15 – తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి జీతాలు ఇస్తాం.
16 – రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇస్తాం.
17 - ఏటా 40లక్షల మందికి ఉచిత విద్య.
http://www.teluguone.com/news/content/-trs-chief-kcr-elections-promises-45-31910.html





