సోంత ఇంట్లోనే బంగారం చోరీ.. ఇంటి దొంగను పట్టేసిన పోలీసులు

Publish Date:Apr 3, 2026

Advertisement

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు  అన్నది సామెత.. కానీ పోలీసులు అలాంటి దొంగను పట్టేశాడు.  ఓ యువకుడు జలసాలకు అలవాటు పడి తన ఇంట్లోనే దఫదఫాలుగా 137 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అయితే ఇంట్లో వాళ్లెవరూ ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇటీవల ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు నగలు ధరిద్దామని నగలపెట్టె ఓపెన్ చేసి  చూడగా బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తులో ఇంటి దొంగ బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.   రాజేంద్రనగర్ కంచన్ బాగ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్  అనే వ్యక్తి గత నెల   31న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు. బంగారు నగలు కనిపించకపోవడంతో  గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేశారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కానీ ఇంటి పరిసరాలు, కుటుంబ సభ్యుల కదలికలు, ఫోన్ కాల్ వివరాలను విశ్లేషించి విషయం తేల్చేశారు. బంగారు ఆభరణాలు చోరీ చేసినది మహ్మద్ షరీఫ్ కుమారుడు  అద్నాన్ షరీఫ్  అని తేల్చాడు.    తన ఇద్దరు స్నేహితులు మహ్మద్ రెహాన్ ఉద్దీన్ (25), మహ్మద్ సమీర్ (22)లతో కలిసిచోరీకి పాల్పడినట్లు గుర్తించారు.  

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి  , జనవరి నుంచి నాలుగు సార్లు ఇంట్లో ఎవరికీ తెలియకుండా నగలను  దొంగిలించాడని తేలింది పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 137 గ్రాముల బంగారు ఆభరణాలు,
4 సెల్ ఫోన్లు,ఒక వెర్నా కారు స్వాధీనం చేసుకున్నారు. 

By
en-us Political News

  
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
1972 లో అపోలో 17 మిషన్ ద్వారా  మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా  ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. 
ఇరాన్ లోకి   చొరబడే అమెరికా సైనికులను మట్టుబెట్టినా లేదా సజీవంగా బంధించి అప్పగించినా భారీ నగదు బహుమతి ఇస్తామంటూ పత్వా ప్రకటించింది. ఈ ఫత్వా సాక్షాత్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ  అఫీషియల్ గా ప్రకటించడం గమనార్హం.
శ్రావణ  సోమవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆశోక్ ధామ్  క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. రద్దీఅధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.