యాంకర్, నటి అసనూయపై కేసు.. ఎందుకంటే?

Publish Date:Aug 17, 2026

Advertisement

ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ మరో సారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.  జై శ్రీరాం వంటి  నినాదాలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై  ఫిర్యాదు నమోదైంది. విషయమేంటంటే..  ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆమె వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. 

సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన అనసూయపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ..  బీజేపీ నేతలు బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు అనసూయపై కేసు నమోదు చేశరు.  కాగా తనపై కేసు నమోదు కావడం, తన వ్యాక్యలపై విమర్శలు వెల్లువెత్తడంపై నటి అనసూయ స్పందించారు.  తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ   కట్టుబడి ఉన్నానని స్పష్టం స్పష్టం చేసిన ఆమె కేవలం నినాదాలు చేయడం మాత్రమే ధర్మం అనిపించుకోదనీ,  ప్రవర్తన,  నైతిక విలువలు ఎంతో కీలకమని చెప్పడమే తన ఉద్దేశమన్నారు.

తాను  సనాతన ధర్మాన్ని, హైందవ సంప్రదాయాలను గౌరవిస్తాననీ..  శ్రీరాముడిని,  ఆంజనేయ స్వామిని  ఆరాధిస్తానని పేర్కొన్న అనసూయ,  తన వ్యాఖ్యల  వల్ల సమాజంలో ఉన్న అసలైన దొంగలు, ముసుగు వేసుకున్న వ్యక్తులు బయటకు వస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.  

Anasuya Bharadwaj, Borabanda Police Station, Sanatana Dharma Controversy, BJP Leaders Complaint, Jai Shri Ram Remarks

By
en-us Political News

  
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
1972 లో అపోలో 17 మిషన్ ద్వారా  మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా  ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. 
ఇరాన్ లోకి   చొరబడే అమెరికా సైనికులను మట్టుబెట్టినా లేదా సజీవంగా బంధించి అప్పగించినా భారీ నగదు బహుమతి ఇస్తామంటూ పత్వా ప్రకటించింది. ఈ ఫత్వా సాక్షాత్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ  అఫీషియల్ గా ప్రకటించడం గమనార్హం.
శ్రావణ  సోమవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆశోక్ ధామ్  క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. రద్దీఅధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేస్తూ, ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పంపిణీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.
విజయవాడలో డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ.. వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం..!
సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు.
యూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది.
భారత రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వందేమాతరం గీతం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.