యుద్ధం వస్తుందా .. వస్తే ఏమవుతుంది?

Publish Date:Apr 25, 2025

Advertisement

సర్వత్రా ఇదే ఉత్కంఠ!

పహల్గాం ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తరువాత  ప్రధానమంత్రి (గురువారం (ఏప్రిల్ 24)  తొలిసారిగా స్పందించారు. ఉగ్రదాడి నేపధ్యంలో విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని బుధవారమే(ఏప్రిల్23) స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ  గురువారం (ఏప్రిల్ 24) వరకూ వ్యూహాత్మక మౌనం పాటించారు. మరో వంక కాగల కార్యం, కానిచ్చేవారు  కానిచ్చారు. 
విదేశీ పర్యటన నుంచి  తిరిగి వస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా అనూహ్యమైన కీలక నిర్ణయాలు  తీసుకున్నారు.  ప్రధానంగా, 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటుగా అట్టారి భూ-రవాణా పోస్టును వెంటనే మూసివేయడం వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఒక విధంగా ఇది, అటు పాకిస్తాన్ కు ఇటు దేశంలోని పాక్ అనుకూల శక్తులకు కూడా మింగుడు పడ లేదు. నిజానికి, పాకిస్తాన్ సైన్యం, మోదీ మరో మెరుపు దాడి చేస్తారని  ఉహించి  ఎదుర్కునేందుకు సన్నద్దమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో వైమానిక దళాలను, సైన్యాన్నిమోహరించింది.  

అయితే  మోదీ మళ్ళీ మరో మెరుపు దాడి చేశారు కానీ..  పాకిస్తాన్, పాక్ ప్రేమికులు ఆశించిన విధంగా కాదు.. అనూహ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్ పై వ్యూహాత్మక మెరుపు దాడి చేశారు. ఇంతవరకు దాయాది దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, పాకిస్తాన్ సీమాంతర  ఉగ్రవాదాన్ని పతాక స్థాయికి తీసుకు పోయింది. మన దేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా  ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించింది, అయితే..  ఉభయ దేశాల మధ్య వైషమ్యాలు పతాక స్థాయికి చేరినా, మానవతా దృక్పథంతో, మంచితనంతో మన దేశం పాకిస్తాన్ కు జీవాధారం అయిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకోలేదు. కానీ  హద్దులు దాటిన పాక్   పాపాలకు చుక్క  పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయానికి వచ్చింది. కఠిన నిర్ణయం తీసుకుంది. 

అయితే.. ఇంతటితో  అయిపోయిందా, పహల్గాం ఉగ్రదాడిని ఇక్కడితో మరిచి పోవడమేనా?  అంటే,  లేదు  అసలు ‘యుద్ధం’ ఇప్పుడే మొదలైందని విశ్లేషకులు అంటున్నారు.  అవును.. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇంచుమించుగా 48 గంటలకు పైగా వ్యూహాత్మక మౌనం పాటించిన ప్రధాని మోదీ  గురువారం (ఏప్రిల్24) బీహార్లోని మధుబనిలో జరిగిన పంచాయతీ రాజ్ కార్యక్రమంలో తొలిసారిగా  పహల్గామ్ ఉగ్రదాడి పై బహిరంగంగా స్పందించారు. నిజానికి  ప్రధాని మోదీ స్పందించారు,అనే కంటే దేశ ప్రజల గుండె మంటలను ఆవిష్కరించే విధంగా నిప్పులు చెరిగారు.  గర్జించారు అనడం సమంజసంగా ఉంటుంది. 140 కోట్ల మంది గుండె మంటలను ప్రధాని మోదీ తన గొంతుకలో వినిపించారు.  

అవును.. జమ్మూ కశ్మీర్లో అమాయకుల ప్రాణాలు హరించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా, వెతికి, వెంటాడి, వేటాడి శిక్షిస్తామని హెచ్చరించారు. హంతక ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. అంతే కాదు..  ఉగ్రవాద మూకలకు మద్దతి స్తున్న వారిని కూడా వదిలేది లేదని, కలలో కూడా ఉహించలేని విధంగా  కఠినంగా  శిక్షిస్తామని, ప్రపంచం అంతటికీ వినిపించేలా ప్రపంచ భాష  ఇంగ్లీష్ లోనూ  చెప్పారు. 

 ఈ రోజు, బీహార్ గడ్డపై..  నేను ప్రపంచం మొత్తానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని శిక్షిస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న, కుట్రలో భాగమైన ప్రతి ఒకరినీ వారి ఊహకు కూడా అందని విధంగా కఠినంగా శిక్షిస్తాం. ఇప్పుడు.. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేందుకు మిగిలి ఉన్న ఆ కొద్ది భూభాగాన్ని మట్టి కరిపిస్తాం. మొత్తం దేశం ఈ సంకల్పంలో దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు  అని ప్రధానమంత్రి అన్నారు.

అయితే.. ఖచ్చితంగా ప్రభుత్వం  ఎలాంటి  చర్యలు తీసుకుంటుంది? మాటలు ఎంత వరకు కార్యరూపం దలుస్తాయి? ప్రభుతం ఎందాకా పోతుంది? ఉభయ దేశాల మధ్య మరో యుద్ధానికి దారి తీస్తుందా?  అన్నది ఇప్పుడు దేశం ముందున్నప్రశ్న. నిజానికి, దేశం ముందు కాదు,  ప్రపంచం ముందున్న ప్రశ్న కూడా ఇదే..  అలాగే..  యుద్దమే వస్తే ఏమవుతుంది? అనేది కూడా ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ..

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.