తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది. టీటీడీ పై దుష్ప్రచారం చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పై చెడు ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు, శ్రేణులు అదే పనిగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ద్వేషం తప్ప మరో సిద్ధాంతం అంటూ లేనట్లుగా వైసీపీ వ్యవహారశైలి ఉంది. టీటీడీ గోశాల వివాదం, అన్యమత ప్రార్థనలు, వేద పారాయణంపై మాజీ పాలకమండలి అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. .
తాజాగా జూన్ 29 మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద ఎలాంటి లైసెన్స్ లేని అనాధికార ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ భక్తులకు ఇబ్బంది కలిగించారు.
అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మాట మాట పెరిగి వివాదం పెద్దది అయ్యింది. గొడవ పడుతూ ఆస్థాన మండపం లోని షాపు నెంబరు 96 వద్ద గొడవపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న ఫొటోగ్రాఫర్ ను వివరణ కోరారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు తీరు కూడా అతని విధులకు విరుద్ధంగా ఉండడంతో అతడిని తిరుపతి కి బదిలీ చేశారు. అసలు వాస్తవం ఇది కాగా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా చానెళ్లు తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బం ది అంటూ ప్రసారాలు చేశాయి. దీనిని టీటీడీ తీవ్రంగా ఖండించింది. అదే విధంగా తరచూ టీటీడీపై అసత్యవార్తలను ప్రసారం చేస్తూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమనీ, కఠిన చర్యలు తీసుకుంటామనీ టీటీడీ హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-spreading-misinformation-to-damage-tirumala-sanctity-39-201135.html
Publish Date:Sep 10, 2026
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.