కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో మళ్ళీ అలజడి
Publish Date:Aug 25, 2018
Advertisement
బీజేపీకి అధికారం దక్కకుండా చేయటమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్, కర్ణాటకలో తక్కువ స్థానాలు గెలుచుకున్న కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టింది.. కర్ణాటకలో బీజేపీకి సీఎం పదవి దూరం చేసి కాంగ్రెస్ పంతమైతే నెగ్గించుకుంది కానీ, కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందా అనే అనుమానం కలుగుతుంది.. అసలే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని బీజేపీ ఆశగా ఎదురు చూస్తుంది.. దీనికి తోడు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మాటలు జారీ సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తున్నారు.. ఇది బీజేపీ పాలిట వరంలా మారేలా ఉంది.. తాజాగా కాంగ్రెస్ నేత మాజీ సీఎం సిద్దరామయ్య సీఎం పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.. దానికి సీఎం కుమార స్వామి కౌంటర్ ఇచ్చి తలతిప్పుకున్నారు. అసలు మేటర్ ఏంటంటే తాజాగా హాసన్ జిల్లాలోని హళేనరసీపుర తాలుకాలోని హాడ్య గ్రాయంలో దేవాలయం ప్రారంభం సందర్బంగా సిద్దరామయ్య మాట్లాడారు.. ఐదు సంవత్సరాలు నిరంతరంగా తాను సీఎం పదవిలో ప్రజలకు సేవ చేశానని, కుల మతాలకు అతీతంగా తాను అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టానని అన్నారు.. అయితే కొన్ని శక్తుల కుట్ర వలన తాను మళ్లీ సీఎంని కాలేకపోయానని, అయితే ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని చెప్పారు.. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తనను ఎలాంటి శక్తులు అడ్డుకోలేవని, తాను మళ్లీ సీఎం అవుతానని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో పెనుదుమారమే రేపాయి.. అయితే ఈ విషయంపై కుమారస్వామిని మీడియా ప్రశ్నించగా సంతోషం, ఆయన సీఎం అయితే తాను సంతోషిస్తానని కుమారస్వామి ముఖం తిప్పుకున్నారు.. ఇది ఇంకెంత దుమారం రేపుతుందో ఏంటో.
http://www.teluguone.com/news/content/-siddaramaiah-says-he-will-be-cm-again-39-83255.html





