రాజధాని విషయంలో జగన్ వైఖరి వెనుక రహస్యమేంటంటే?

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో తీర్మానం పూర్తయి, రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చినప్పటికీ.. జగన్ మాత్రం తన విధానం అమరావతి కాదు  మావిగాన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అని ఒకసారి విజయవాడ అంటూ మరోసారి మాట్లాడుతూ.. తన గందరగోళాన్ని తానే బయటపెట్టుకుంటూ, ప్రజలను కూడా గందరగోళంలో పడేయాలని ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై  పొలిటికల్ ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి తెలుగువన్‌తో మాట్లాడుతూ జగన్ వైఖరి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను, రాజకీయ వ్యూహాలను బయటపెట్టారు. 

2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వైసీపీ నాయకులు ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధాని చేయాలని  ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం, రైల్వే కనెక్టివిటీ, నాగార్జున సాగర్ కుడి కాల్వ నీటి లభ్యత వంటి సానుకూల అంశాలు,  రాయలసీమకు కూడా దగ్గరగా ఉంటుందని భావించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కాదని మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన జగన్, గడిచిన ఐదేళ్ల పాటు చంద్రబాబు నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాల నుంచే పరిపాలన సాగించారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో రాజధాని పేరిట 30 వేల ఎకరాలు సేకరించకపోగా..  కేవలం ఋషికొండపై  వందల కోట్ల రూపాయలతో పర్యాటక భవనాలను కూల్చి తన కోసం ఓ  ప్యాలెస్ నిర్మించుకున్నారని విమర్శించారు.  2024 ఎన్నికలలో మూడు రాజధానుల అంశంపైనే ప్రజలు వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి తిరస్కరించినా జగన్ తీరు మారలేదన్నారు. 

ప్రస్తుతం జగన్ తెరపైకి తెచ్చిన  మావిగన్ అనే ఆలోచన ఆయన సొంతం కాదనీ.. తిరుపతికి చెందిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఇచ్చిన ఐడియా అని మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని నిర్మిస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడి పేరు శాశ్వతంగా ఉండిపోతుందనే ఏకైక వ్యక్తిగత ద్వేషం,  అసూయతోనే జగన్ ఈ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని విశ్లేషించారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ  నిర్మాతగా చంద్రబాబు పేరు ఎలా చిరస్థాయిగా నిలిచిపోతుందో..  అమరావతి విషయంలో కూడా  చంద్రబాబు పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనీ, ఒక రాజధాని నగరాన్ని నిర్మించిన వ్యక్తిగా చంద్రబాబు కీర్తి శాశ్వతంగా నిలుస్తుందన్న భయం, ఆసూయా, ద్వేషం కారణంగానే  జగన్ అమరావతిపై విషం చిమ్ముతున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు.

 అమరావతి  సెల్ఫ్ సస్టేయినబుల్ క్యాపిటల్  అన్నారు.  అమరావతి కోసం తీసుకువచ్చే అప్పులను అమరావతే తీర్చుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రజలపై భారం పడదనే సత్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

YS Jagan Mohan Reddy, Amaravati capital controversy, Madhusudan Reddys analysis, Chandrababu Naidu,  AP capital, Mavigan slogan,  Telugu One

By
en-us Political News

  
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.