తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా.. దర్శకుడుగా తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్!

Publish Date:May 19, 2026

Advertisement

గత 26 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కొనసాగుతున్న సంస్థ తెలుగువన్. ఇండియాలోనే ప్రప్రథమంగా యూట్యూబ్‌కి లింక్ అయిన తొలి ఛానల్‌గా తెలుగువన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివిధ కేటగిరీల్లో అందరికీ ఉపయోగపడే ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తెలుగువన్ 2024లో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. 

రైతుల సమస్యలు ప్రధానంగా తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా  రాజధాని ఫైల్స్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందర్నీ ఆలోచింపజేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే ఉత్సాహంతో ఇప్ప్పుడు తెలుగు వన్ ప్రొడక్షన్స్ సంస్థ తమ రెండో చిత్రాన్ని ప్రకటించింది.

తన బర్త్‌డే సందర్భంగా తాము నిర్మించబోయే రెండో చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు కంఠంనేని రవిశంకర్. పంచభూతాలను ప్రధాన కథా వస్తువుగా తీసుకొని సినిమాకి అనుగుణంగా దాన్ని విస్తరించి ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు మే 19. తెలుగువ‌న్ స్టాఫ్‌తోపాటు ప‌లువురు అతిథులు ఆయ‌న పుట్టినరోజు వేడుక‌లో పాల్గొన్నారు. తెలుగువ‌న్ డైరెక్ట‌ర్ ర‌మేష్ ఈ వేడుక‌లో పాల్గొని కంఠంనేని ర‌విశంక‌ర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపి, తెలుగువ‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మాణం జ‌రుపుకోనున్న రెండవ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. 

ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేయడమే కాకుండా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ సినిమాకి ర‌చ‌న చేస్తున్నారు. 2027 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా ఇప్పటి నుంచే ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శకనిర్మాత కంఠంనేని రవిశంకర్ తెలియజేశారు.

తెలుగువ‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మాణం జ‌రుపుకోనుకున్న ఈ చిత్రాన్ని కె.హిమ‌బిందు స‌మ‌ర్పిస్తున్నారు. స‌హ‌నిర్మాత‌గా వై.జ‌తిన్‌కుమార్ వ్య‌వ‌హ‌రిస్తారు. జ‌నార్థ‌న మ‌హ‌ర్షి ర‌చ‌న‌లో నిర్మాణం జ‌రుపుకోనున్న ఈ చిత్రం కాన్సెప్ట్‌, ద‌ర్శ‌కుడు నిర్మాతః ర‌విశంక‌ర్ కంఠంనేని.

By
en-us Political News

  
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.