సంజయ్‌దత్‌ అదృష్టవంతుడా!

Publish Date:Feb 27, 2016

Advertisement

 

1994- ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న పోలీసులు సంజయ్‌దత్‌ను టాడా చట్టం కింద అరెస్టు చేయడం విని ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. బాలీవుడ్‌ ప్రేమ జంట సునీల్‌దత్- నర్గీస్‌ల గారాల పుత్రుడైన సంజయ్ ఏమంత మంచి బాలుడు కాదని దేశానికి తెలుసు. కానీ తీవ్రవాదులతోనే దోస్తీ కట్టి, వారి ఆయుధాలను దాచిపెట్టేందుకు ఉపయోగపడతాడని ఏనాడూ ఊహించలేదు. 1993లో ఆ తీవ్రవాదులు ముంబైలో మారణహోమాన్ని జరిపి వందలాది మంది ప్రాణాలను హరించి ఉండకపోతే, బహుశా ఈ విషయం సద్దుమణిగిపోయేదేమో. కానీ సంజయ్‌కు ఆ తీవ్రవాదులకూ సంబంధాలు హద్దులు దాటి ఉన్నాయనే విషయం సుస్పష్టంగా తేలిపోవడంతో అతన్ని అరెస్టు చేయక తప్పలేదు. పైగా అప్పటికి కఠినమైన టాడా చట్టం అమల్లో ఉండటంతో సంజయ్‌ తప్పించుకోవడం అంత తేలిక కాలేదు. అయినా సంజయ్‌దత్‌ అదృష్టవంతుడే అంటారు చాలామంది. ఎందుకంటే...

 

సంజయ్‌దత్‌ యవ్వనంలోకి అడుగుపెడుతూనే మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. పాపం తల్లి చనిపోయిన బాధలో ఆ వ్యసనానికి లోనయ్యాడని ప్రపంచమంతా జాలిపడింది. సామాన్యులు ఏదన్నా వ్యసనంలో ఇరుక్కుంటే ఇలాంటి జాలిని పొందడం కష్టమే! తరువాత ఆయనను ముంబై పేలుళ్ల సందర్భంగా అరెస్టు చేస్తే బాలీవుడ్ అంతా కంటతడి పెట్టింది. సంజయ్‌ను విడుదల చేసేందుకు ఏకంగా పార్లమెంటు స్థాయిలోనే పైరవీలు జరిగాయి. సంజయ్‌ తండ్రి సునీల్‌ దత్‌ కాంగ్రెస్‌ నేత అయినా కూడా పార్టీలకు అతీతంగా బాల్‌థాకరే, శతృఘన్‌ సిన్హా వంటి వారు ఆయనకు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు. సంజయ్‌దత్‌ కేవలం తన కుటుంబ రక్షణ కోసమే అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నాడనీ... అభంశుభం ఎరుగని ఆ పసివాడు, అబూసలీం వంటి తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్నాడనీ పెద్దలంతా తెగ బాధపడిపోయారు.

 

నిజానికి తన కుటుంబ రక్షణ కోసం ఆయుధాలను కలిగి ఉన్నాని చెప్పడం అంత హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఎందుకంటే అతని కుటుంబానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ అలాంటి ప్రమాదం ఉంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ తీవ్రవాదులని కాదు. ఒకవేళ ఆశ్రయించినా మరీ మూడు AK-56 తుపాకులూ, 20 గ్రైనేడులూ, 450 బుల్లెట్లూ... కలిగి ఉండాల్సిన అవసరం అసలే లేదు. ఈ జాబితాను చూస్తే ఒక యుద్ధానికి సరిపడా మందుగుండుని సమకూర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆ యుద్ధం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు! ఇంతజరిగిన తరువాత కూడా, సంజయ్‌దత్‌కు ఆయుధాలను అందచేసిన డెలివరీ బాయ్‌కి ఎంత శిక్ష పడిందో ఆయనకు కూడా అంతే తేలికపాటి శిక్ష పడింది.

 

తీవ్రమైన నేరంలో ఇరుక్కున్న సంజయ్‌దత్‌ తేలికపాటి శిక్షతో తప్పించుకున్నందుకు ఇటు ప్రభుత్వం కానీ, అటు కేసుని విచారిస్తున్న సీబీఐ కానీ ఎలాంటి అప్పీలూ చేయలేదు. కేసుని తిరిగి ఎక్కడా దాఖలు చేయలేదు. పైగా సీబీఐ సంజయ్‌దత్‌ కేసులో తన నివేదికను చాలా తేలికపాటి పదాలతో కూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంజయ్‌దత్‌ని విచారించిన న్యాయమూర్తులు కూడా స్వల్పకాల శిక్షతో సరిపెట్టేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటో కూడా ఎవరికీ అంతుపట్టదు. సంజయ్‌కు విధించిన తేలికపాటి శిక్ష తనని సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని అతని న్యాయవాది సతీష్‌ తరువాత కాలంలో పేర్కొన్నాడు.జైల్లో ఉన్నప్పుడు కూడా సంజయ్‌కి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఎంతవరకూ నిజమో కానీ ఆయన తరచూ పెరోల్‌ మీద నెలల తరబడి బయటకు వచ్చిన మాట వాస్తవం. ఈ విషయమై సాక్షాత్తూ ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది.

 

ఇప్పుడు కూడా సంజయ్‌దత్‌ను ‘సత్ప్రవర్తన’ ఆధారంగా ఎనిమిది నెలల ముందుగా విడుదల చేసింది ప్రభుత్వం. ముంబై పేలుళ్ల సందర్భంగా సంజయ్‌దత్‌లాగానే అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నందుకు జైబున్నీసా అనే విధవరాలికి కూడా ఐదేళ్ల శిక్షను విధించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు, క్యాన్సర్‌ రోగి, కిడ్నీలు పాడైపోవడంతో ఈమధ్యే ఆపరేషన్ జరిగింది, ఆమెకు అయిదుగురు కుమార్తెలు.... తన తల్లిని విడుదల చేయమంటూ ఆమె కుమార్తెలు ఎందరి చుట్టూనో తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆమె జైళ్లోనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి... సంజయ్‌దత్‌ అదృష్టవంతుడా కాదా!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.