కేసీఆర్‌పై RRR ఫైట్‌.. అసెంబ్లీలో అబ్ ఆయేగా మ‌జా...

Publish Date:Nov 3, 2021

Advertisement

RRR. రాజ‌మౌళి తీస్తున్న సినిమా గ్లిమ్స్ ఎంత సెన్సేష‌న‌ల్‌గా మారిందో.. హుజురాబాద్‌ పొలిటిక‌ల్ గ్లిమ్స్ కూడా అంతే సంచ‌ల‌నంగా నిలిచింది. RRR. రాజాసింగ్‌. ర‌ఘునంద‌న్‌రావు. ఈట‌ల రాజేంద‌ర్‌. బీజేపీ త‌ర‌ఫున‌ ముగ్గురు మొన‌గాళ్లు. అసెంబ్లీలో కేసీఆర్‌ను కుమ్మేసేందుకు కాలు దువ్వుతున్న పోట్ల‌గిత్తెలు. ప్ర‌భుత్వాన్ని అడుగ‌డుగునా నిల‌దీసేందుకు.. స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను స‌భ‌లో ఎండ‌గ‌ట్టేందుకు.. కేసీఆర్ పాల‌నా రీతిని నిగ్గ‌దీసి అడిగేందుకు.. అవినీతిని నిప్పుల‌తో క‌డిగేసేందుకు.. క‌ద‌నోత్సాహంతో సిద్ధ‌మ‌వుతున్నారు ఆ ముగ్గురు. 

మ‌ద‌పుటేనుగు లాంటి కేసీఆర్‌ను.. త‌న విజ‌యంతో బంధించేలా ఈట‌ల రాజేంద‌ర్ అసెంబ్లీకి దూసుకొస్తున్నారు. రాజ్యం త‌న‌ యావ‌త్ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని మోహ‌రించి.. కుట్ర‌లు, కుతంత్రాల‌కు తెగించి.. ప‌థ‌కాలు, పైస‌లు వెద‌జ‌ల్లినా.. హుజురాబాద్ మాత్రం ఈట‌లకు జీహుజూర్ అంది. త‌మ బిడ్డ‌ను క‌డుపులో పెట్టుకుని సాదుకుంటామ‌ని తేల్చిచెప్పేసింది. ఈట‌ల విజ‌యం కేసీఆర్ ప‌త‌నానికి నాంది అంటున్నారు. హుజురాబాద్ గెలుపుతో కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా దెబ్బ‌కొట్టిన రాజేంద‌ర్‌.. ఇక అసెంబ్లీలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని చీల్చిచెండాడేందుకు త‌న మిగ‌తా ఇద్ద‌రు స‌హ‌చ‌రుల‌తో క‌లిసి రెడీ అవుతున్నారు.  

RRRలో మొద‌టి R..రాజాసింగ్‌. ఓల్డ్‌సిటీకా రాజా. పాత‌బ‌స్తీ గ‌బ్బ‌ర్‌సింగ్‌. ఏళ్లుగా మ‌జ్లిస్‌పై సింగిల్ హ్యాండ్‌తో పోరాడుతున్న నిఖార్సైన లోట‌స్ వారియ‌ర్‌. గో సంర‌క్ష‌ణ కోసం తీవ్రంగా పాటుబ‌డుతున్న నాయ‌కుడు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. సింహం సింగిల్‌గా అన్న‌ట్టు.. హౌజ్‌లో బీజేపీకి మౌత్‌స్పీక‌ర్‌గా నిలిచారు. మొద‌ట్లో ఒంట‌రి పోరాటం చేసినా.. ఆ త‌ర్వాత ర‌ఘునంద‌న్ తోడ‌య్యారు. ఇప్పుడు గ‌జేంద్రుడిలా రాజేంద్రుడు జ‌త క‌లిశారు. ఆ ముగ్గురి క‌ల‌యిక‌తో అసెంబ్లీలో అబ్ ఆయేగా మ‌జా.. అంటున్నారు. 

RRRలో రెండో R.. ర‌ఘునంద‌న్‌రావు. బీజేపీ నేత‌ల్లోకెల్లా బ‌ల‌మైన వాయిస్‌. స్వ‌త‌హాగా లాయ‌ర్ అయిన ర‌ఘునంద‌న్‌.. ప్ర‌భుత్వ లోటుపాట్ల‌ను.. లా పాయింట్‌ల‌ను..  బ‌య‌ట‌కు లాగి కేసీఆర్ స‌ర్కారును గ‌ట్టిగా ప్ర‌శ్నించే స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు. హుజురాబాద్‌లానే దుబ్బాక‌లో జ‌రిగిన హోరాహోరీ ఫైట్‌లో నెగ్గి.. అసెంబ్లీలో కేసీఆర్ నోటితోనే ర‌ఘునంద‌న్‌రావుకు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని పొగిడించుకునేలా ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్నారు. ఇన్నాళ్లూ అసెంబ్లీలో బీజేపీ త‌ర‌ఫున మేజ‌ర్ వాయిస్ వినిపించిన ర‌ఘునంద‌న్‌కు.. కేసీఆర్ అంత‌టిస్థాయి ఉన్న‌ ఈట‌ల రాజేంద‌ర్‌లాంటి ఉద్య‌మ‌నాయ‌కుడు తోడ‌వ‌డం వెయ్యి ఏనుగుల బ‌లం క‌లిసొచ్చిన‌ట్టే.

RRRలో మూడో R.. రాజేంద‌ర్‌. ఒక‌ప్పుడు టీఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత కేసీఆర్ అంత‌టివారు. ఉద్య‌మాన్ని ముందుండి ఉర‌క‌లెత్తించిన నాయ‌కుడు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ప్ర‌ధాన భాగ‌స్వామి. కీల‌క శాఖ‌ల‌కు మంత్రులుగా ప‌ని చేసిన అనుభ‌వం. కేసీఆర్‌ను రెండు ద‌శాబ్దాలుగా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించిన‌ రైట్‌హ్యాండ్‌. కేసీఆర్ గుట్టు.. లోటుపాట్లు.. స‌ర్వం తెలిసిన ఆంత‌రంగికుడు. గులాబీ పాల‌నలో సాగుతున్న ధ‌న‌యజ్ఞానికి ప్ర‌త్య‌క్ష సాక్షి. కేసీఆర్ నియంతృత్వం.. మంత్రులను డ‌మ్మీ చేసే గుణం.. అధికారుల బేల‌త‌నం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ అరాచ‌కత్వం.. ఇలా కేసీఆర్ ఆయువుప‌ట్టు తెలిసిన స‌మ‌ర్థ‌మైన నేత‌. అలాంటి ఈట‌ల ఇప్పుడు కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా.. బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడితే.. ఇప్పుడుంటుంది అస‌లైన మ‌జా..అంటున్నారు. గ‌తంలో వైఎస్సార్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుడినే ధిక్క‌రించి.. అసెంబ్లీలో ద‌డ‌ద‌డ‌లాడించిన ఈట‌ల రాజేంద‌ర్‌.. ఇప్పుడిక కేసీఆర్‌ను గ‌డ‌గ‌డ‌లాడించేందుకు కాషాయ‌కండువాతో స‌భ‌లో అడుగుపెడుతున్నారు. 

ఇలా ముగ్గురు బీజేపీ మొన‌గాళ్లు.. RRR రూపంలో అసెంబ్లీలో కేసీఆర్‌తో భీక‌ర యుద్ధం చేసేందుకు సై.. అంటే సై సైరా.. అంటూ క‌లిసొస్తున్నారు. ఇక‌, గులాబీ బాస్‌కు ముందుందంతా.. ముస‌ళ్ల పండ‌గే..అంటున్నారు.

By
en-us Political News

  
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.