దేవుడా.. రాహుల్ మళ్లీ బుక్కయ్యాడా..!
Publish Date:Jul 20, 2016
Advertisement
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా..ఇంకా అతన్ని ఏం తెలియని వ్యక్తిగా చూస్తుంటారు. ఇంక ప్రతిపక్ష నేతలైతే రాహుల్ గాంధీపై సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటారు. రాహుల్ గాంధీకి ఏం తెలియదని.. రాహుల్ గాంధీ తెలివితక్కువ మేధావి అని అబ్బో ఇలా చాలానే విమర్శలు చేస్తుంటారు. అందుకే సొంత పార్టీ నేతలు కూడా రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటే భయపడుతున్నారు. రాహుల్ గాంధీ ఎంత ప్రతిభవంతుడో తెలిసే యూపీ ఎన్నిక్లలో ఆయన్ను కాదని.. ప్రియాంక గాందీని బరిలో దించుదామనకున్నారు. అది కూడా వద్దనుకొని యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆఖరికి షీలా దీక్షిత్ ను ఎంపికచేశారనుకోండి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి ఇంత పొగడటానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారా. అదేంటంటే.. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశ చర్చల్లో అప్పుడప్పుడు నిద్రకి ఉపక్రమించడం కామన్. ఇప్పుడు కూడా అలాగే నిద్రపోతూ బుక్కయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడోరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఒకపక్క ప్రతిపక్ష, విపక్ష నేతలు గుజరాత్ దాడుల గురించి కొట్టుకుంటుంటే మరోపక్క రాహుల్ గాంధీ మాత్రం హాయిగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు సైతం రాహుల్ చేసిన పనికి ఖంగుతిన్నారు. ఒకపక్క గుజరాత్ దాడులపై చర్చలు జరగాలని.. బీజేపీ పార్టీని ఇరుకున పెడదామని ఆందోళనలు చేస్తుంటే తమ నేతే ఇలా చేసినందుకు వారు ఢిపెన్స్ల్ లో పడిపోయారు. ఇక ఇది చూసిన బీజేపీ నేతలు ఊరుకుంటారా.. రాహుల్ గాంధీపై ఒకటే విమర్శలు చేశారు. దళితులపట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇదే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి రాహుల్ గాంధీని అన్నారంటే అన్నారు అంటారు కాని.. ఆయన చేసే పనులను బట్టే అందరూ అంటారు మరి.
http://www.teluguone.com/news/content/-rahul-gandhi-39-64018.html





