జగన్ ఇలాకాలో పసుపు పార్టీ పంచ్..ఐదు ఎంపీటీసీలు ఏకగ్రీవం.!
Publish Date:Oct 27, 2026
Advertisement
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది. పులివెందుల మండల పరిధిలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం కూడా టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు స్పష్టమయ్యాయి. దీంతో పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకగ్రీవాల్లో పుష్పనాథ్రెడ్డి కీలక పాత్ర.! పులివెందుల మండలంలోని కొత్తపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు పుష్పనాథ్రెడ్డి ఐదు ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవంలో కీలక పాత్ర పోషించారు. కొత్తపల్లి ఎంపీటీసీ స్థానానికి తాను ప్రాతినిధ్యం వహించడంతో పాటు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి సూచనల మేరకు మిగిలిన నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి, అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునే దిశగా కృషి చేశారు. ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి.! పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐదు స్థానాలూ ఒకే పార్టీకి దక్కడంతో ఎంపీపీ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది.పులివెందులలో గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకోనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీపీ ఎన్నిక పూర్తయితే మండల పరిషత్లో అధికార మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. [ Pulivendula Politics, YS Jagan Mohan Reddy, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, B Tech Ravi, Kadapa Political News, Pulivendula MPTC Elections, MPTC Unopposed Elections, TDP Victory, Pulivendula MPP Election, Kadapa Local Body Elections, Andhra Pradesh Politics, Coalition Alliance, Madem Pushpanath Reddy ]
ఆయన ప్రయత్నాలు ఫలించడంతో మండలంలోని ఐదు స్థానాలూ టీడీపీకి దక్కాయి. పులివెందుల మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు ఎంపీటీసీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాలను అందుకున్నారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఈ. కొత్తపల్లి నుంచి మాడెం పుష్పనాథ్రెడ్డి, ఎర్రబల్లి-2 నుంచి కడపన శ్యామలాదేవి, ఎర్రబల్లి-1 నుంచి పండిటి రాజశేఖర్, రాగిమానుపల్లి నుంచి బండి సునీత, అచ్చవెల్లి గంగనపల్లి నుంచి మహమ్మద్ షరీఫ్ ఉన్నారు.
http://www.teluguone.com/news/content/-pulivendula-politics-25-235582.html




