తదుపరి లక్ష్యం ఇంటర్నెట్ కేబుల్స్.. ఇరాన్ సంకేతాలు!

Publish Date:Apr 23, 2026

Advertisement

అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇప్పుడు సరికొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ముడి చమురు రవాణాకు అడ్డుకట్ట వేస్తామంటూ హెచ్చరిస్తున్న ఇరాన్..  ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చిది. సముద్ర గర్భంలో ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా మారే అవకాశం ఉందన్న సంకేతాలను పంపుతోంది. ఇరాన్  అధికారిక వార్తా సంస్థలల విశ్లేషణలు అదే చెబుతున్నాయి.  ఈ కేబుల్స్ ను ఇరాన్ లక్ష్యం చేసుకుంటే.. గల్ఫ్ దేశాల డిజిటల్ వ్యవస్థ కుప్పుకూలే ప్రమాదం ఉంది.  

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ తో సంబంధం ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి కేవలం చమురు, గ్యాస్ రవాణాకే కాకుండా..  ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ జలసంధి గుండా కనీసం ఏడు ప్రధాన అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్స్ వెళ్తున్నాయి. వీటిలో ఫాల్కన్, ఏఈఈ-1, టీజీఎన్-గల్ఫ్, మరియు ఎస్ఈఏ ఎమ్ ఇ, విఈ  వంటి అతిపెద్ద కేబుల్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ కేబుల్స్ ద్వారానే ఆసియా, ఐరోపా,  మధ్యప్రాచ్య దేశాల మధ్య ఇంటర్నెట్ డేటా వేగంగా ప్రవహిస్తుంది.

ఒకేసారి పలు కేబుల్స్ దెబ్బతింటే లేదా కావాలని దెబ్బ తీస్తే..  పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తీవ్రమైన ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడుతుంది. దుబాయ్, దోహా వంటి నగరాల్లో స్టాక్ మార్కెట్లు స్తంభించిపోవడమే కాకుండా, ఈ-కామర్స్, బ్యాంకింగ్ లావాదేవీలు  విమానయాన సేవలు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ ఈ కేబుల్స్ ద్వారా ఇతర అరబ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు డిజిటల్ సేవల కోసం ఈ సముద్రగర్భ కేబుల్స్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

గతంలో ఎర్ర సముద్రంలో కేబుల్స్ దెబ్బతిన్నప్పుడు భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిలో అటువంటి పరిస్థితే తలెత్తితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రాతితీవ్రమైన  ప్రభావం చూపుతుంది. చమురు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవచ్చని, కానీ సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతింటే వాటిని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుందని, అంతవరకు డిజిటల్ సేవలు స్తంభించిపోతాయని తస్నీమ్ తన కథనంలో పేర్కొంది. 

రానున్న రోజుల్లో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగితే..  ఇరాన్ ఈ కేబుల్స్‌ను ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు గల్ఫ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేబుల్స్ భద్రత ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాలుగా మారింది. మొత్తంమీద, హోర్ముజ్ జలసంధి ఇప్పుడు కేవలం 'ఎనర్జీ చొక్ పాయింట్' గానే కాకుండా 'డిజిటల్ చొక్ పాయింట్' గా కూడా మారిపోయింది.

By
en-us Political News

  
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.