రాత్రంతా ఏడ్చాను..ఆ సమయంలో సువేందు నన్ను ఓదార్చారు : మహువా మోయిత్రా

Publish Date:Jun 24, 2026

Advertisement

 

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అత్యంత కీలక నేతలుగా ఉండి, ప్రస్తుతం పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఉన్న పాత బంధం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత సువేందు అధికారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మహువా మోయిత్రా తన రాజకీయ జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తాను పడిన మానసిక వేదనను ఆమె పంచుకున్నారు. ఆ సమయంలో టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై, రాత్రంతా ఏడ్చానని, ఆ కష్టకాలంలో తనకు వెన్నుముకగా నిలిచి ఓదార్చిన ఏకైక వ్యక్తి శుభేందు అధికారి మాత్రమేనని మహువా సంచలన నిజాలను వెల్లడించారు. 

రాజకీయంగా ఇప్పుడు విభిన్న ధృవాలుగా విడిపోయినప్పటికీ, సువేందు అధికారితో తనకు ఇప్పటికీ ఒక బలమైన 'ఎమోషనల్ కనెక్షన్' ఉందని ఆమె స్పష్టం చేశారు. తన తొలి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కరీంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు టీఎంసీలోని ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా తన కోసం ప్రచారం చేయడానికి రాలేదని మహువా పేర్కొన్నారు. కానీ ఆ రోజుల్లో పార్టీలో నెంబర్ టు స్థానంలో ఉన్న శుభేందు అధికారి స్వయంగా వచ్చి తన తరఫున మొదటి ఎన్నికల ర్యాలీలో పాల్గొని మద్దతుగా నిలిచారని చెప్పారు. 

నేటికీ ఆనాటి ఫోటోలు చూస్తే అందులో కేవలం తను, సువేందు మాత్రమే కనిపిస్తారని ఆమె గుర్తుచేశారు. 2020లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో వచ్చిన విభేదాల వల్ల శుభేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లో వరుసగా రెండుసార్లు ఓడించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం బెంగాల్ సీఎం పీఠంపై ఉన్న శుభేందుతో తనకు ఇప్పుడు నిరంతర సంభాషణలు లేకపోయినప్పటికీ, వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడూ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, నాడు ఆయన చేసిన సహాయాన్ని తాను ఎప్పటికీ మరువలేనని మహువా మోయిత్రా కుండబద్దలు కొట్టారు. 

ప్రస్తుతం టీఎంసీ పార్టీలో తీవ్ర అసమ్మతి రేగి, దాదాపు 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు పక్షాన ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలో మహువా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లోక్‌సభలో కూడా 20 మంది టీఎంసీ ఎంపీలు వేరే పార్టీలో విలీనమై బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో, మహువా మోయిత్రా పార్టీ మారబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాను టీఎంసీని వీడే ప్రసక్తే లేదని, మమతా బెనర్జీయే అసలైన తృణమూల్ అని ఆమె స్పష్టం చేశారు. 

అదే సమయంలో, గతంలో పార్టీని వీడిన తిరుగుబాటుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ మారాలనుకుంటే శుభేందు అధికారి లాగా పారదర్శకంగా, ధైర్యంగా మారాలని, అంతేకానీ లోపల ఉంటూ గోతులు తవ్వకూడదని హితవు పలికారు. బీజేపీ క్రమశిక్షణ గల క్యాడర్ ఆధారిత పార్టీ అని, అది కేవలం ఒకే ఒక్క వ్యక్తిపై ఆధారపడి నడవదని చెబుతూనే, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మహువా తేల్చి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న మహువా, శుభేందుల పాత స్నేహం గురించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  

By
en-us Political News

  
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.