20 ఏళ్లు దాటితే కిడ్నీ టెస్టులు చేయించుకోవాలి.. కేంద్రం సూచన..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

దేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై పార్లమెంటరీ సంఘం ఆందోళన..!

దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 20 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరితో ఆరు నెలలకోసారి తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం యువతలో సైతం మూత్రపిండాల వ్యాధులు తీవ్రరూపం దాల్చడంపై పార్లమెంటరీ ప్యానెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చాలామందికి కిడ్నీలు గణనీయంగా దెబ్బతినే వరకు వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదని పేర్కొంది. మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు కఠిన వాతావరణంలో పనిచేసే వ్యవసాయ కూలీలు, డీహైడ్రేషన్, కలుషిత నీటిలోని భార లోహాల ప్రభావం కూడా దీనికి కారణమవుతున్నాయని తెలిపింది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా 'ఉద్దానం' ప్రాంతంలో ప్రబలుతున్న తీవ్ర కిడ్నీ వ్యాధుల సమస్యను కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సరైన వైద్య వసతులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య జటిలమవుతోందని, పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

వ్యాధి నిర్ధారణ విధానంలో మార్పులు తీసుకురావాలని కమిటీ కోరింది. కేవలం సీరం క్రియాటినిన్ పరీక్ష మాత్రమే కాకుండా, ఈజీఎఫ్ఆర్, యూరిన్ అల్బుమిన్, ప్రొటీన్ పరీక్షలను కూడా తప్పనిసరిగా చేయాలని సూచించింది. ల్యాబ్‌లు క్రియాటినిన్ నివేదికలోనే అదనపు రుసుము లేకుండా ఈజీఎఫ్ఆర్ విలువను ముద్రించేలా నిబంధనలు తేవాలని ప్రతిపాదించింది.

క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక చేయూతతో పాటు ప్రత్యేక ఆరోగ్య బీమా వర్తింపజేయాలని కమిటీ సిఫారసు చేసింది. మారుమూల, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ధరలకే డయాలసిస్ సేవలు అందేలా ప్రత్యేక కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని నొక్కి చెప్పింది.

ప్రజల్లో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వ్యాధి నివారణ ప్రచార కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, పాఠశాల విద్య నుంచే మూత్రపిండాల పట్ల అవగాహన కల్పించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని స్పష్టం చేసింది.

పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ కీలక సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన జాతీయ విధానాన్ని అమలు చేస్తే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది కిడ్నీ రోగులకు పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Kidney tests, parliamentary committee, kidney problems, CKD disease, health insurance, Parliamentary Panel, Chronic Kidney Disease,Kidney Function Test, Uddanam Kidney Disease, National Health Policy,Health Ministry India


 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు.
ప్రస్తుతం పీఓకే, మరియు బలూచిస్థాన్‌లు ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడడ అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజా అశాంతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్.. భారత్ లో విధ్వంసం కుట్రకు తెరలేపిందని పరిశీలకులు అంటున్నారు.
విఐపి మొబైల్ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్ అంటే ఏమిటి? 9999, 0000, 786, 1234 వంటి నంబర్లను ఆన్‌లైన్‌లో ఎలా ఎంచుకోవాలి, ధర వివరాలు మరియు భద్రతా జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ ప్రజల జీవితాలను, వ్యాపార ఆశయాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి. వోడాఫోన్ సర్వేలోని కీలక గణాంకాలు, విజయావకాశాలు మరియు ఎదురవుతున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!
ఆస్ట్రేలియా సెన్సస్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టు 11 సెన్సస్ నైట్ తేదీ, నిబంధనలు, AU$364 జరిమానాలు, ఎవరు అర్హులు మరియు హెల్ప్‌లైన్ సమాచారం ఇక్కడ చూడండి.
జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..!
లీప్ ఇండియా ఐపీఓ LEAP India IPO బిడ్డింగ్ చివరి రోజు సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం GMP , ఐపీఓ ధర, లిస్టింగ్ తేదీలు మరియు విశ్లేషకుల సబ్‌స్క్రైబ్ రేటింగ్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 1.75 లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నేరారోపణలు, బర్త్ టూరిజం, $5 మిలియన్ల ఆర్థిక స్కామ్‌లు మరియు సోషల్ మీడియా పోస్టులే ప్రధాన కారణంగా వీసాల వేటు పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఉన్న సంచలనాత్మక లంచం మరియు మోసం కేసును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపూర్ణ కథనం కోసం చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.