కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో విషాదం..!

Publish Date:Jul 5, 2026

Advertisement

 

పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణ వార్తను తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ‘మిస్ యూ డాడ్’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న 22 ఏళ్ల యువకుడు, నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు, లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి నెట్టివేయబడి దారుణ హత్యకు గురయ్యాడు. నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి పక్కా స్కెచ్‌తో ఘోరానికి ఒడిగట్టారు. జూన్ 18న జరిగిన ఈ ఘోర కలి మనవడిని ఎంతగానో ప్రేమించే ఆ తాతయ్య గుండెను పిండేసింది. మనవడు ఇక లేడనే నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.

కేతన్ అగర్వాల్ మరణించిన నాటి నుంచి ఆయన తాత, సక్సెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు దేవీచంద్ అగర్వాల్ (71) తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. శనివారం రాత్రి 9:45 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఆయన కన్నుమూశారు. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన మనవడు హత్యకు గురికావడం, ఆ నింద కాబోయే కోడలిపైనే పడటంతో ఆ వృద్ధుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మనవడి మరణం మిగిల్చిన తీరని శోకమే చివరకు ఆయన ప్రాణాలను బలితీసుకుంది. అగర్వాల్ కుటుంబంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు ఈ సంచలన కేసులో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. కేతన్‌కు ఉన్న నత్తి, బట్టతల కారణంగా తలపాగా (విగ్) ధరించడం ఆమెకు నచ్చలేదని, అందుకే అతడిని వదిలించుకోవాలని చూసినట్లు పేర్కొంది. ఇందుకోసం జూన్ 14నే ఓసారి లోహగఢ్ కోటపై నుంచి నెట్టేయడానికి ప్రయత్నించగా, కేతన్ పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పాము వచ్చిందని అబద్ధం చెప్పి తప్పించుకున్న సియా, జూన్ 18న 400 అడుగుల లోతున్న ఘోస్ట్ పాయింట్ లోయలోకి ప్రియుడితో కలిసి నెట్టేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

ఈ హత్యకోసం నిందితుడు చేతన్ టోల్ ప్లాజాల వద్ద దొరికిపోకుండా ఉండేందుకు ఏకంగా 90 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించి కోట వద్దకు చేరుకున్నాడు. క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం పోలీసులు డమ్మీని ఉపయోగించి దర్యాప్తు చేయగా, సియా ఈ దారుణానికి ముందే స్నాప్‌చాట్ లో తన స్నేహితురాలికి 'అసలు జరగని పెళ్లి కోసం ఆధార్ కార్డు పంపమంటూ' గుప్త సందేశాలు పంపినట్లు ఆధారాలు లభించాయి. 

కేతన్ మరణించాక కూడా అతడి మొబైల్ ఫోన్‌ను కొంతసేపు సియా తన వద్దే ఉంచుకుని ఆధారాలు నష్టం చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ 14 రోజుల జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమించింది. ఒకవైపు న్యాయ పోరాటం సాగుతుండగానే, తాతయ్య దేవీచంద్ గుండె పగిలి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.
 

By
en-us Political News

  
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.