బీఆర్ఎస్.. కేసీఆర్ పాన్ ఇండియా మూవీ.. ఖర్చుకు తగ్గేదేలే

Publish Date:Oct 4, 2022

Advertisement

కేసీఅర్   జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఒక పాన్ ఇండియా మూవీలా విడుదల కాబోతోంది.   ఖర్చుకు తగ్గేదేలే అంటూ చేతికి ఎముక లేదన్నట్లుగా డబ్బులు వెదజల్లుతున్నారు.  నిర్మాత ఎక్కడా వెనకాడకుండా, రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట,పది రూపాయలు ఖర్చుపెట్టి, సినిమాను చాలా రిచ్ గా తీశారు. సెట్స్  కాస్ట్యూమ్స్ ఒకటనేమిటి 24 ఫ్రేమ్స్ లో లక్ష్మీదేవి గలగలు కనిపిస్తాయి. వినిపిస్తాయి. ఇంతవరకు, నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  హిస్టరీలో ఇలా చేతికి ఎముక లేదన్నట్లుగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీసిన నిర్మాతను చూడలేదు. సహజంగా నటీనటులు, దర్శకులు సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాతను ఇలాగే పొగిడేస్తుంటారు. సరే, చివరకు ఆ సినిమా హిట్టా, ఫట్టా, నిర్మాత పరిస్థితి ఏమిటి, అనేది పక్కన పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ వేదిక కోసం చేస్తున్న సన్నాహాలు, సినిమా బాబుల డాబులను మించి పోతున్నాయని  అంటున్నారు.  

ఇప్పటికే, దేశం మొత్తం చుట్టి వచ్చేందుకు దేశంలో ఏ పార్టీకీ లేని విధంగా రూ.80 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏకంగా ఛార్టర్డ్ ఫ్లైట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇక ప్రకటనల ఖర్చు, టీవీ స్లాట్స్ కు ఎన్ని వందల  వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో లెక్క లేదు. అదిగో పైన ఆ నిర్మాత గురించి నటీ నటులు చెప్పినట్లు, చేతికి ఎముక లేదన్నట్లుగా, తగ్గేదే లే అంటూ దేశం మొత్తం ధూమ్ ..ధామ్..గా ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. డబ్బుల మూటలు కదిలిపోతున్నాయి., అంటున్నారు.  కేసీఆర్ ను జాతీయ హీరోను చేసేందుకు కటవుట్లు, హోర్డింగులు, ఒకటనేమిటి దేశాన్ని  గులాబీ మయం చేసందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

అదొకటి అలా ఉంటే కేసీఆర్  సొంత విమానంతో పాటుగా సొంతంగా జాతీయ స్థాయిలో ఒక రెండు టీవీ చానెల్స్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది. కేసేఆర్ ఆలోచన చేస్తున్నారు అంటే అది ఆయిపోనట్లే. కేసీఆర్ ను ప్రధానిగా, కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఏ వీరభిమానో, రేపు ఈ జేబులోంచి ఓ వంద కోట్లు, ఆ ప్యాకెట్ లోంచి మరో వంద కోట్లుతీసి భక్తిగా సమర్పించుకుంటే, రెండేమి ఖర్మ ఏకంగా నాలుగు చానల్స్, స్టార్ట్ చేసినా చేస్తారు. కేసీఆర్ కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు, వీరాభిమానులు క్యూ కడుతున్నప్పుడు, ప్రభుత్వ విప్ వినయభాస్కర్ చెప్పినట్లు  ఛార్టర్డ్ ఫ్లైట్స్ టీవీ చానల్స్, పత్రికలు, ఫ్రీ పుబ్లిసిటీ అసలు ఇష్యూనే కాదు  అంటున్నారు.

అయితే, కేవలం డబ్బులు కుమ్మరిస్తే జాతీయ నాయకుడు అయిపోతారా? అలా ఆనుకుంటే కేసీఆర్ ను తక్కువ చేయడం కాదు కానీ, ఆయనను మించిన కుబేరులు దేశంలో చాలా మందే ఉన్నారు. నిజమో కాదో తెలియదు గానీ  సోనియా గాంధీ కూడా ప్రపంచలోనే అత్యంత ధనిక  మహిళా రాజకీయ నాయకులలో ఒకరని ఒకప్పుడు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ  చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతి కనిష్ట స్థాయికి, 50 సీట్లకు పడి పడిపోయింది. 

నిజమే రాజకీయాల్లో రాణించేందుకు ఛార్టర్డ్ ఫ్లైట్స్, టీవీ చానల్స్, పత్రికలు, సొంత మీడియా అవసరమే కానీ, కేవలం డబ్బులనే నమ్ముకుంటే, ఏమవుతుందో చెప్పేందుకు హుజురాబాద్ అనుభవం ఒక్కటి చాలు వేరే ఉదాహరణలు అవసరం లేదు అంటున్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమం డబ్బులతో సక్సెస్ కాలేదు. నిజానికి  ఈ రోజు తెరాస ఖాతాలో ఉన్న సోమ్ముల్లో ఒక్క శాతం కూడా ఆ రోజు లేవని అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు ఇవ్వన్నీ తెలియవా అంటే తెలియక కాదు అయినా, అయన తెగ్గేదేలే .. అంటున్నారని అంటున్నారు. అందుకే  కేసేఅర్ జాతీయ చిత్రం హిట్టా ..ఫట్టా అనేది అప్పుడే తేలదని అంటున్నారు.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.