Publish Date:Oct 27, 2023
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. తాజాగా మావోయిస్టులు కేసీఆర్ టార్గెట్ గా బహిరంగ లేఖ విడుదల చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది. మావోయిస్టు జేఎమ్‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. ప్రాజెక్టు కుంగిపోవడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అందులో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అంతర్రాష్ట్ర వంతెన పిల్లర్ 30 మీటర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యత లోపమేనని పేర్కొన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి బ్యారేజీని నిర్మించి కేవలం మూడేళ్లే అయిందన్నారు.
2016 మే 2న నిర్మాణం చేపట్టగా, 2019 జూన్ 21న ప్రారంభించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బ్యారేజీ ఇలా కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమన్నారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని, నిర్మాణం సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కానీ ఈ విషయాన్ని అప్పుడు బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు.
ఈ ప్రాజెక్టు వద్దకు ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను కూడా రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసులతో ముందస్తు అరెస్టులు చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారన్నారు. విషయం బయటకు రాకుండా అణచివేశారని, మీడియాను బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృథా కావడానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని ఆ లేఖలో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-kcr-is-responsible-on-medigadda-25-164103.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.