బోండా ఉమా కామెంట్స్‌పై రాజకీయ కాక.. కాపులకు క్లారిటీ ఉంది.!

Publish Date:Jul 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై వివాదం సృష్టించింది. గుంటూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో  ముచ్చటించడం, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓటింగ్ శైలి,   పార్టీ అంతర్గత నిర్ణయాలపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు అమరావతి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధిష్టానం దీనిపై వివరణ కోరడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి.

ఈ పరిణామాలపై ప్రముఖ అనలిస్ట్ విక్రమ్ పూలా తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగుదేశం విఫ్ గా ఉంటూనే బోండా ఉమా ఒకటిరెండు సార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాలను గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా వ్యాఖ్యలకు, ఆయన వ్యవహార శైలికి పెద్ద ప్రాముఖ్యత నివ్వాల్సిన అవసరం లేదన్నారు.  ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు.

పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.  ఒకవైపు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి వంటి సంక్షేమ, ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉన్న వేళ బోండా ఉమా వైఖరి పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు.

అయినంత మాత్రాన బోండా ఉమా వ్యవహారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాపులకు క్లారిటీ ఉందన్న విక్రమ్ పోలా.. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన కాపు నాయకులు ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత అక్కడ ఎలాంటి ప్రాముఖ్యతా లేక, ఇమడ లేక తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా విషయానికి అనవసర ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరమన్నారు.  

Bonda Uma controversy, TDP Kapu politics, Ambati Rambabu Bonda Uma, AP political developments, Tone News Telugu news

By
en-us Political News

  
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.