కవిత పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్...టీఆర్ఎస్‌ పేరు ఫిక్స్!

Publish Date:Apr 30, 2026

Advertisement

 

 తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు, కవితకు అధికారిక పత్రాలను అందజేశారు.

గత కొద్దికాలంగా తన రాజకీయ ప్రస్థానంపై సస్పెన్స్ కొనసాగించిన కవిత, ఇటీవల మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో సొంత పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆమె తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు. కానీ, ఎన్నికల సంఘం నిబంధనలు మరియు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

తుది నిర్ణయం ప్రకారం, కవిత పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’  గా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. విశేషమేమిటంటే, ఈ పార్టీ సంక్షిప్త నామం ‘టీఆర్ఎస్‌’ గా ఉండబోతోంది. గురువారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం ప్రతినిధులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకుని, పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని స్వయంగా ఆమెకు అందజేశారు.

తెలంగాణ అస్తిత్వం, రక్షణే ధ్యేయంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ నుంచి ‘తెలంగాణ రక్షణ సేన’గా పేరు మారినా, లక్ష్యం మాత్రం మారబోదని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ అనే పాత సెంటిమెంట్ పేరు మళ్లీ తెరపైకి రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

తొలుత పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించినప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ‘రక్షణ సేన’గా మారడం వెనుక ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణ అనే భావన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లే లక్ష్యంగా కవిత తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ అధికారిక ఆమోదంతో కవిత తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. త్వరలోనే పార్టీ జెండా, గుర్తు, మరియు కమిటీల ప్రకటన ఉండే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల పర్యటనలకు కూడా ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కవిత దరఖాస్తు చేసుకున్న “తెలంగాణ రక్షణ సేన” పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ సందర్భంగా కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

“తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన విషయాన్ని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడం ఆనందంగా ఉంది. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేస్తున్న కృషిని కొనసాగిస్తూ, ఇకపై కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తాను” అని పేర్కొన్నారు.

అలాగే, “జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికమేనేమో… లేక ‘టీఆర్ఎస్’ నాకు రాసిపెట్టి ఉందేమో!” అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు.

కవిత దరఖాస్తులో సూచించిన పేర్లు ఇవి:

  • తెలంగాణ ప్రజా జాగృతి
  • తెలంగాణ జాగృతి
  • తెలంగాణ రక్షణ సేన
  • తెలంగాణ రాష్ట్ర జాగృతి
  • తెలంగాణ ప్రజాశక్తి

ఈ ఐదు పేర్లలో ఏదో ఒక పేరుతో రాజకీయ పార్టీ స్థాపనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కవిత కోరగా, అప్లికేషన్‌లో మూడో ప్రాధాన్యతగా పేర్కొన్న “తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)” పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

By
en-us Political News

  
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.