‘బాద్‌షా’ సెన్సార్ కట్స్ ఇవే!
Publish Date:Apr 3, 2013
Advertisement
యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాధ్షా సినిమా విడుదలకు కేవలం మరొక్క 36 గంటలు మాత్రమే మిగిలి ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గిర పడుతున్న కొద్దీ ఆ సినిమా గురించి ఒకటొకటిగా బయటకి వస్తున్న ఆసక్తికరమయిన వార్తలు బాధ్షా రేంజిని అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెంచేశాయి. ఇక యన్టీఆర్ అభిమానుల సందడికి హద్దే లేదు. శ్రీను వైట్ల కామెడీ, నందమూరి పులి చేసిన యాక్షన్ సీన్లు ఎపుడెపుడు చూద్దామా అని వారు ఒకటే తహతహలాడిపోతూ సినిమా టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇక ఆ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా అనుకూలంగా రావడంతో బాధ్షా పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. నందమూరి అభిమానులకి తెలుగు వన్ అందిస్తున్న బాధ్షా సినిమా సెన్సార్ రిపోర్ట్: దర్శకుడు శ్రీను వైట్ల తన బాధ్షాకు ‘యు’ సర్టిఫికేట్ పొందాలనే ముందు జాగ్రత్తగా సినిమాలో ప్రతీ చిన్న అంశాన్ని సెన్సార్ కళ్ళద్దాలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీసినా కూడా ఇంటర్వెల్ కి ముందు ‘రామారావు’ బాద్షా గా మారే సన్నివేశంలో కొంచెం వయోలెన్స్ ఎక్కువయిండానే కారణంతో బాద్షాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిసింది. కానీ, శ్రీను వైట్ల కష్టం వృధాపోలేదు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు అసలు కత్తెర ఉపయోగించే పని పడలేదని సమాచారం. అందువల్ల శ్రీను వైట్ల తన బాధ్షాను నందమూరి అభిమానులకు ఏవిధంగా చూపాలని భావించాడో పూర్తిగా ఆవిధంగానే చూపించగలుగుతున్నాడు. ముఖ్యంగా బాధ్షా-బ్రహ్మానందం-యమ్మస్ నారాయణలతో కలిసి చేసిన హాస్య సన్నివేశాలను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు అంత అద్భుతంగా కామెడీ పండించిన నటులని, అంత గొప్పగా మలచిన దర్శకుడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారని సమాచారం, ఇక సినిమాలో కట్స్ వేయకపోయినా ‘నీ అబ్బ, బలుపు, బొంగు, బొక్క వంటి పదాలకు బీప్ శబ్దాలు తగిలించేసారు. అదేవిధంగా బాద్షా సిగరెట్ కాల్చే సన్నివేశాలకి పొగ త్రాగుట హానికరం అనే హెచ్చరికలు తప్పని సరి. ఇక వెల్కం కనకం అనే పాటలో ‘కలకండ’ అనే పదంలో కూడా సెన్సార్ బోర్డు వారికి బూతు కనిపించడంతో దానికీ ఒక బీప్ తగిలించేసారు. ఇటీవల విడుదల అవుతున్న చిన్న సినిమాలో యూత్ ని ఆకర్షించేందుకు దర్శకులు విరివిగా బూతులు చొప్పిస్తున్నా అభ్యంతరం చెప్పని సెన్సార్ బోర్డు ‘కలకండ’ కి ఎందుకు బీప్ తగిలించిందో తెలియదు. మొత్తం మీద సెన్సార్ కత్తెర భారిన పడకుండా బాద్షా తప్పించుకొన్నందుకు చాలా సంతోషించవలసిన విషయమే. శ్రీను వైట్ల మార్క్ కామెడీని, యంగ్ టైగర్ మార్క్ యాక్షన్ సన్నివేశాలని, పంచ్ డైలాగులను తీసుకు వస్తున్న బాద్షా ఘన విజయం ఖాయమని ముందే డిసైడ్ అయిపోయాడు గనుక ఇక మనం బాద్షాను సింపుల్ గా ఫాలో అయిపోవడమే బెటర్.
http://www.teluguone.com/news/content/-jrntr-32-22209.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





