సేవ చేస్తే సంతోషం లభిస్తుంది!

Publish Date:Aug 10, 2016

Advertisement

 

మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతారు భారతీయులు. సేవ చేస్తే పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయని ఆశిస్తారు. ఇందులో వాస్తవం లేకపోలేదని నిరూపిస్తోంది ఒక పరిశోధన. స్వచ్ఛంద సేవలో పాల్గొన్నవారు పదికాలాల పాటు చల్లగా ఉంటారని పేర్కొంటోంది.

 

17 ఏళ్ల పరిశోధన

ఇంగ్లండుకు చెందిన రెండు సంస్థల నేతృత్వంలో 1991 నుంచి 2008 వరకు ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 66,000 మందికి కొన్ని ప్రశ్నాపత్రాలను అందించారు పరిశోధకులు. వీటి ద్వారా వారిలో ఎందరు స్వచ్ఛంద సేవలో పాల్గొంటున్నారన్న విషయాన్ని గమనించారు. అదే సమయంలో వారిలోని మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిశీలించారు. ఇలా మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఒక ప్రమాణికమైన GHQ-12 అనే విధానాన్ని అవలంబించారు.

 

పెద్దవాళ్లదే పెద్దమనసు

- పరిశోధనలో పాల్గొన్నవారిలో 21 శాతం మంది తాము తరచూ స్వచ్ఛంద సేవలో పాల్గొంటామని తెలియచేశారు.

 

- మగవారికంటే ఆడవారే సేవ చేసేందుకు ఎక్కువగా చొరవ చూపుతున్నట్లు తేలింది.

 

- ఈ పరిశోధనలో 15 ఏళ్ల కుర్రవాళ్ల నుంచి 80 ఏళ్లకి పైబడిన వారందరూ పాల్గొన్నారు. అయితే సేవ చేసేందుకు కుర్రవాళ్లకంటే వృద్ధులే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నట్లు వెల్లడైంది.

 

అనూహ్యమైన ఫలితాలు

ఈ పరిశోధనలో స్వచ్ఛంద సేవ చేయడానికీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య స్పష్టమైన సంబంధం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే యువకుల మానసిక ఆరోగ్యం మీద స్వచ్ఛంద సేవ తాలూకు ప్రభావం పెద్దగా కనిపించకపోగా... 40 ఏళ్లు దాటినవారిలోనే ఇలాంటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదే రకమైన సానుకూల ప్రభావం 80 ఏళ్లు దాటినవారిలో కూడా కనిపించింది.

 

కారణం

పెద్దవారవుతున్న కొద్దీ స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వల్ల ఉపయోగాలు ఉండటానికి రకరకాల కారణాలను చెబుతున్నారు పరిశోధకులు. స్వచ్ఛంద సేవ చేయడం వల్ల సామాజిక బంధాలు గట్టిపడతాయనీ, వీటితో ఆరోగ్యమూమెరుగుపడుతుందంటున్నారు. పైగా వయసు పైబడినవారిలో తాము ఎవరికీ, ఎందుకూ పనికిరామన్న భావన కలిగే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా తమ అవసరం ఈ సమాజానికి ఉందన్న నమ్మకం కలుగుతుంది. ఇక చాలామంది వృద్ధులు ఒంటరితనంలో మగ్గిపోతుంటారు. ఇలాంటివారికి నలుగురితో కలిసి నాలుగు మంచి పనులు చేసే అవకాశాన్ని స్వచ్ఛంద సేవలు కల్పిస్తాయి.

 

అదీ సంగతి! సేవ చేస్తే పుణ్యం లభిస్తుందో లేదోగానీ.... మానసిక ఆరోగ్యం మాత్రం పదిలంగా ఉంటుందన్నమాట. అలాగని ఏదో పక్కింటివారికి కాసేపు సాయం చేసి రావడం కాదట. నిబద్ధతతో సమాజానికి చేసే సేవే సత్ఫలితాలనిస్తుందంటున్నారు పరిశోధకులు.

 

- నిర్జర.

By
en-us Political News

  
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.