రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవం వద్దంటున్న జనసేన

Publish Date:Mar 12, 2026

Advertisement

 

జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.  జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో ఆవిర్భావ వేడుకలను పరిమితం  చేయాలని క్యాడర్‌కు సూచించింది.  జనసేన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. 100 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన... గెలిచిన మొదటి ఏడాది అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంది. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కార్యకర్తలు, నేతలు పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం సభలో సుదీర్ఘ ప్రసంగాన్ని ఇచ్చారు . సీన్ కట్ చేస్తే.... ఏడాది తర్వాత.. అంటే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను   రాష్ట్రస్థాయిలో  నిర్వహించడం లేదని స్వయంగా పార్టీ ప్రకటించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని, ఇది పవన్ కళ్యాణ్ ఆదేశాలంటూ.. జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.. 

దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందట. ఏడాది ముందు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సభను.. ఇప్పుడు ఉన్నపలంగా ఎందుకు రద్దు చేసుకున్నారన్నది జనసైనికులను కూడా విస్మయానికి గురి చేస్తుందట. వాస్తవంగా పార్టీ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని, ఉష్ణోగ్రతలు ప్రతికూలంగా ఉన్నాయని.. అందుకే రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశామని జనసేన పార్టీ ప్రకటించినా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని చర్చ పొలిటికల్ సర్కిల్లో సాగుతుందట.

ప్రధానంగా పార్టీ నాయకత్వ తీరుపై కార్యకర్తల్లో,  నేతల్లో అసంతృప్తి పెరుగుతుందట. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న పరిణామాలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం, కూటమిలో అంతర్గత విభేదాలు వంటి కారణాలతో, జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర గందరగోళంలో ఉన్నారంటున్నారు. నామినేటెడ్ పదవులు విషయంలో సైతం జనసేన నాయకులు,  కార్యకర్తల్లో తీవ్ర సంతృప్తి వ్యక్తం అవుతుందట. అంతేకాదు కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ కొనసాగాలని, కూటమి  ధర్మాన్ని పాటించకపోతే  మొహమాటం లేకుండా  బయటికి వెళ్ళిపోవచ్చని  పవన్ కళ్యాణ్ అంటుండటం జనసైనికులకు నచ్చడం లేదంటున్నారు. 

జనసైనికుల కారణంగా పొత్తుకు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దంటూ పదేపదే పవన్ కళ్యాణ్ మాట్లాడడం, వారికి నచ్చడం లేదనేదని పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న టాక్. వాస్తవానికి ఈసారి కూడా పిఠాపురంలో  ఆవిర్భావ సభ నిర్వహించాలని జనసేన పార్టీ మొదట భావించింది.. గత ఏడాది జరిగిన చిత్రాడ ప్రాంగణాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానం, పిఠాపురం నేతలను ఆదేశించింది. అయితే ఏం జరిగింది ఏమో గాని, రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేసాం.. దాని స్థానంలో  యూత్ మీటింగ్ నిర్వహిద్దామని, అందుకు స్థలాన్ని చూడాలంటూ పిఠాపురం నేతలకు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చింది. 

చివరికి దాన్ని కూడా రద్దు చేసి .. ఆవిర్భావ వేడుకలను జిల్లాలకు మండలాలకు మాత్రమే పరిమితం చేసింది జనసేన పార్టీ.. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రద్దు చేయడానికి కారణం... సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేయడానికే అంటూ జనసేన మరో ప్రకటన కూడా చేసింది.. వాస్తవానికి సభ్యత్వ నమోదు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోందట. సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజులు అవుతుందా కేవలం 7, 8 లక్షల మాత్రమే చేయగాలిగారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వం నమోదు కావడంపై ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉందట. 

వైసీపీ ప్రభుత్వం హయాంలో  ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన వరుసగా రెండు సంవత్సరాలు  పార్టీ ఆవిర్భావ సభలు నిర్వహించింది. 2022 లో ఇప్పటం గ్రామంలో, 2023 మచిలీపట్నంలో ఆ పార్టీ వరుసగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో... పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించకపోవడం జనసేన పార్టీలో చాలామందికి మింగుడు పడడం లేదట. ఏది ఏమైనప్పటికీ... పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభలు రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదంటున్నారు.
 

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.