జగన్ భద్రతకు నిజంగా ముప్పు ఉందా?

Publish Date:Aug 7, 2026

Advertisement

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భద్రతకు నిజంగా ముప్పు ఉందా? పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో  జగన్  భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది.  అంతటితో ఆగకుండా,  జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

వైసీపీ  ఎంపీల బృందం  ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవల కలిసి  జగన్‌కు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. జగన్ భద్రతలో కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనీ వైసీపీ ఎంపీలు  ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలపైనా, రాష్ట్రంలో  వైసీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులతో కేసులు బనాయిస్తున్నారని వారు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చినట్లు వారు ఆ తరువాత మీడియాకు తెలిపారు.  

అయితే..  వైఎసీపీ ఎంపీల ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం  తోసిపుచ్చింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయమై స్పందిస్తూ, జగన్ మోహన్ రెడ్డికి  భద్రత తగ్గించినట్లు వైసీపీయలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.  స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.  ప్రభుత్వం తరుఫున భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేవని వంగలపూడి అనిత కండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  వైసీపీ   పర్యటనలు, సభలలో పోలీసు అనుమతులకు మించి భారీగా జన సమీకరణ చేస్తుండటమే అసలు సమస్య పేర్కొన్నారు.  అనుమతించిన దాని కంటే  ఎన్నో రెట్లు ఎక్కువగా జనాన్ని వైసీపీ తరలించడంవల్లనే  క్షేత్రస్థాయిలో భద్రతా నిర్వహణ పోలీసులకు సవాలుగా మారుతోందనీ,  ప్రణాళికారాహిత్యమైన ఈ తీరు వల్లనే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 

జగన్ భద్రత తగ్గించినట్లు స్పష్టమైన ఆధారాలేవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రతకు సంబంధించి రాజకీయ విమర్శలు రావడం సహజమే అయినా.. ఈ విషయంలో రాజకీయ వివాదాల కంటే భద్రతా ఏజెన్సీల అంచనాలకే ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

 Jagans security, Amit Shah, YCP MPs, Vangalapudi Anita, Jagan security controversy, Andhra Pradesh politics, TeluguOne

By
en-us Political News

  
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.