పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసిన జగన్ సర్కార్: గోరంట్ల

Publish Date:Nov 7, 2022

Advertisement

జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అధ్వానంగా తయారైంది. తన తుగ్లక్ విధానాలతో ఆయన రాష్ట్రంలోని ప్రతి వర్గాన్నీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా ధాన్యంకొనుగోళ్ల విషయంలో జగన్ సర్కార్ విధానాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఆరోపిస్తున్నారు.  రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసే దౌర్బాగ్య స్థితికి చేరిందన్నారు.  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇంతటి దౌర్భాగ్య సర్కార్ అధికారంలో ఉండటం ఏపీ దౌర్బాగ్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నూతన నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గోరంట్ల అన్నారు. గత ఏడాది రైతులు విక్రయించిన ధాన్యానికే ఇప్పటికింకా సొమ్ములు అందక నానా అగచాట్లూ పడుతున్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారనీ, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. పంటలకు మద్దతు ధర లేదు, పంట నష్టపోయిన వారికి పరిహారం లేదు, రైతు భరోసా రైతు దగాగా రూపాంతరం చెందిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. అన్న దాతల ఆత్మహత్యలలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందంటే వ్యవసాయాన్ని జగన్ సర్కార్ ఎంత సంక్షోభంలో ముంచేసిందో అర్ధం చేసుకోవచ్చని గోరంట్ల చెప్పారు.

గత తెలుగుదేశం పాలనలో రైతులకు వారం రోజుల్లోనూ ధాన్యం బకాయిలు అందేవనీ, జగన్ హయాంలో అయితే నెలలు గడుస్తున్నా ధాన్యం బకాయిలు చెల్లించడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్ నూతన నిబంధనలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు.

దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని  డిమాండ్‌ చేశారు.   జగన్ రెడ్డి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతల అవినీతి కేంద్రాలుగా మారాయని దుయ్యబట్టారు. వైసీపీ నేతల ఇష్టాయిష్టాల మేరకు అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శించారు.ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.  

By
en-us Political News

  
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.