జగన్ దీక్ష భగ్నం

Publish Date:Aug 31, 2013

Advertisement

 

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరవధిక దీక్ష చేస్తున్న నేపథ్యంలో దీక్ష విరమింపజేయాలని జైళ్ల శాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీక్ష విరమణకు ఒప్పుకోకుంటే బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని సూచించింది. జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా ఆయన వైద్యానికి సహకరించడం లేదని నిమ్స్ వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో జైళ్ల శాఖ ఆదేశాలిచ్చింది.

 

 

జగన్ ఆరోగ్యం మెరుగుపడాలంటె బలవంతంగా అయినా గ్లూకోజ్ ఎక్కించక తప్పదని నిమ్స్ వైద్యులు నగేష్ తెలిపారు. ఇప్పుడు ఒక్కసారి ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించడం మొదలు పెడితే నాలుగు రోజుల పాటు సాగుతుందని, ఆ తరువాత ఎన్ని రోజులు అలా అనేది చెప్పలేమని తెలిపారు. జగన్ దీక్ష నేటికి ఏడో రోజుకు చేరింది. ఆయన నిలబడితే బీపీ పడిపోతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తో పాటు కిడ్నీ పారామీటర్స్ కూడా తగ్గిపోయాయని డాక్టర్ శేషగిరి ఆధ్వర్యంలో చేసిన వైద్య పరీక్షల వివరాలను బులెటిన్ లో వెల్లడించారు.
 

By
en-us Political News

  
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే ఇవ్వ‌డం క‌రెక్టేన‌ని.. క‌ళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొంద‌రూ వైపీపీయులు దీన్నో భూత‌ద్దంలో పెట్టి చూపెడుతూ త‌ప్పు ప‌డుతున్నారు.
జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 27 మంది ఉసురు తీసిన సంఘటనకు నిరసనగా ఉవ్వెత్తున ఆందోళనలు చెలరేగాయి.
జమ్మూ కశ్మీర్ పై ఉగ్రవాదం మరో మారు పంజా విసిరింది. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్ర మూకలు మరో మారు తెగబడ్డాయి.అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 27 మంది టూరిస్టులు మరణించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 23) శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతోంది.
టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి వార్త నన్ను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు
ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారుఒంగోలు పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉన్న వీరయ్య పై దుండగులు దాడి చేశారు. ముసుగులో వచ్చిన దుండగులు వీరయ్య పై దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గాయపడ్డ వీరయ్యను చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఏపీ రాజ్య సభ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బిజెపికి ఇచ్చేందుకు... టిడిపి అలాగే జనసేన రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బిజెపికి కేటాయించారు.ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.. రాజ్యసభ అభ్యర్థి పై చర్చ జరిగింది. అమిత్ షా... నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కిషన్ రెడ్డి కూడా కలిశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు అన్నామలైను అభ్యర్థిగా నిలపబోతున్నట్టు అమిత్‌షా, చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతు పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. స్ధానిక ఎమ్మెల్యే సంజయ్‌కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా? అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ హస్తం పార్టీలో చేరడంతో కనీసం తన సంప్రదించకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కాంగ్రెస్ అధిష్టం జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా ప్రభుత్వం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్‌గా వచ్చిన ఎఫ్‌-15 ఫైటర్ జెట్‌లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ అరేబియా చేరుకున్నారు.
ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా ఉదాహరణ తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్.
స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణి. 2001లో ట్రైనీ ఐఏఎస్ గా కెరీర్ మొద‌లు పెట్టి.. బీఆర్ఎస్ హ‌యాంలో సీఎంఓలో అపాయింట్ అయిన తొలి మ‌హిళా ఉన్న‌తాధికారిణిగా ఆమెకున్న నేమ్ అండ్ ఫేమ్ నేష‌న‌ల్ రేంజ్. ఒక స‌మ‌యంలో ఆమె గురించి ఒక ఆంగ్ల ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌సార‌మైందంటే ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవ‌చ్చు.
వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్‌ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై పౌరసత్వంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్‌ నెలలో చెన్నమనేని రమేష్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.