Publish Date:Nov 19, 2012
అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. 77 పరుగుల టార్గెట్ ను భారత్ ఒక్క వికెట్ నష్టపోయి చేదించింది. వీరేంద్ర స్వెవాగ్ పరుగులు చేసి స్వాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. పుజారా 41 విరాట్ కోహ్లీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఐదు వికెట్ల నష్టానికి 340 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండు 356 పరుగుల వద్ద ఆరో వికెట్ పడిపోయింది. ప్రియర్ 91 పరుగుల వద్ద అవుటయ్యాడు. కెప్టెన్ అలిస్టిర్ కుక్ కూడా 176 పరుగుల వద్ద అవుటయ్యాడు. 365 పరుగుల వద్ద ఇంగ్లాండు కుక్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. రెండో ఇన్నింగ్సులో ఓజా నాలుగు వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు , జహీర్ ఖాన్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-india-wins-first-test-36-19203.html
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్‌లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.