మాదాపూర్‌లో విదేశీ మహిళలతో వ్యభిచార దందా గుట్టురట్టు.!
Publish Date:Oct 26, 2026
Advertisement
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. మాదాపూర్, కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలు పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూమ్ నంబర్ 204లో సోదాలు.! మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో ఉన్న ‘ఓరియన్ ఎలిగెంట్’ సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రూమ్ నంబర్ 204లో సోదాలు నిర్వహించి ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే వీసా లేవని, నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ ముగ్గురు మహిళలను విచారించడంతో ఈ వ్యవహారం వెనుక ఢిల్లీకి చెందిన నాయక్ అనే వ్యక్తి ఉన్నట్లుగా వెళ్లడైంది. ఉద్యోగాల పేరుతో ఉజ్బెకిస్తాన్ మహిళలను ఇక్కడికి రప్పించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న నాయక్‌పై కేసు నమోదు* చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. అపార్ట్మెంట్ల నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక.! పట్టుబడిన ముగ్గురు మహిళలను న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు, సర్వీస్ అపార్ట్మెంట్ల నిర్వాహకులు గదులు అద్దెకు ఇచ్చే ముందు కస్టమర్ల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. [ Gachibowli prostitution racket, Uzbekistan women arrested, Hyderabad crime news, foreign women sex racket, Gachibowli police raid, Dream Pride hotel case ]
http://www.teluguone.com/news/content/-gachibowli-prostitution-racket-25-235408.html





