ఫార్ములా ఈ రేసు కేసులో ఏ1 కేటీఆర్‌పై చార్జ్‌షీట్.. కీలక ఆరోపణలు..!

Publish Date:Jul 31, 2026

Advertisement

ఫార్ములా ఈ రేసు వ్యవహా రంలో ఏ1గా పేర్కొన్న కేటీఆర్‌పై చార్జ్‌షీట్‌లో పలు తీవ్రమైన ఆరోపణలను దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. క్యాబినెట్, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అనుమతులు తీసుకోకుండానే ఫార్ములా ఈ సీజన్-10ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ప్రభుత్వం తరఫున ఒప్పందాలపై సంతకం చేసే అధికారం లేకపోయినప్పటికీ, ఏ2 ద్వారా 2022 జనవరి 17న లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ (LOI)పై సంతకం జరిగేలా కేటీఆర్ చురుకుగా వ్యవహరించారని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 

అనంతరం 2023 సెప్టెంబర్ 27న హెచ్‌ఎండీఏ రూపొందించిన నోట్‌ఫైల్‌ను ఆమోదించి, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గంతో జరగాల్సిన తప్పనిసరి సంప్రదింపులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించింది. ఏ2 ద్వారా ఒప్పందాలను అమలు చేయడానికి అనుమతిస్తూ రాజ్యాంగ నిబంధనలు, హెచ్‌ఎండీఏ చట్టం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్‌తో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిం చారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. 

ఈ నిర్ణయాల కారణంగా ఫార్ములా ఈ సీజన్ 10, 11, 12లకు కలిపి ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల ఆర్థిక భారం పడే పరిస్థితి ఏర్పడిందని చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇతర నిందిత అధికారులను కూడా నిబంధనలను ఉల్లం ఘించేలా ఆదేశించారని, ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఉద్దేశం ఉందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఫార్ములా ఈ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందాయని చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. గత ప్రమోటర్ ఫార్ములా ఈ నిర్వహణలో భారీ నష్టాలను చవిచూసిన విషయం తెలిసినప్పటికీ, ఇతర నిందితులతో కలిసి కుట్రపన్ని హెచ్‌ఎండీఏను సీజన్ 10, 11, 12లకు ప్రమోటర్‌గా తీసుకువ చ్చారని ఆరోపించింది. 

దీని ద్వారా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపా రని పేర్కొంది. అలాగే హెచ్‌ఎండీఏ చట్టబద్ధ పరిధికి వెలుపల 75,88,65,179 ప్రజాధ నాన్ని వినియోగించేందుకు కారణమయ్యారని, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూరిందని చార్జ్‌షీట్‌లో ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలు, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను వ్యవస్థాపితంగా ఉల్లంఘించారని, ఈ చర్యలు నిజాయితీ లేని ఉద్దేశాన్ని, క్రిమినల్ దుర్వినియోగాన్ని సూచిస్తున్నాయని దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇవన్నీ ఏ1గా పేర్కొన్న కేటీఆర్ పాత్రపై దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ప్రధాన ఆరోపణలుగా చార్జ్‌షీట్‌లో ఉన్నాయి.

 Formula E case , KTR, KCR, BRS Party, Chargesheet, Hmda, IAS Arvind Kumar, BLN Reddy,Quid pro quo,  Electoral bonds

By
en-us Political News

  
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
55 అడుగులు దాటిన నీటిమట్టం..!
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ ఇంధన భద్రత, వ్యవసాయ రంగం, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రధాని
ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్‌ నియామకం..!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.