ఐదు దశాబ్దాల కల..నెరవేరిందిలా.!

Publish Date:Jul 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామీణ మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో  భాగంగానే ఐదు  దశాబ్దాలుగా రవాణా సౌకర్యాలకు నోచుకోని మారుమూల గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించే పనులను అధికారులు వేగవంతం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొడ్డుమామిడి గ్రామానికి   శాశ్వత రోడ్డు మార్గం సాకారమౌతోంది.   ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న మట్టి రోడ్డు నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. 

గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన బొడ్డుమామిడి గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం  ప్రభుత్వం   నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల   ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

బొడ్డుమామిడి  గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తూ చేపట్టిన పనులు వేగంగా సాగుతుండటంతో తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే  ప్రధాని నరేంద్ర మోదీలకు వారు  కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతోనే ఈ మారుమూల పల్లెకు శాశ్వత విముక్తి లభించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నాణ్యత విషయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్  మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దష్టి సారించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకూడదని, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులకు విస్పష్ట ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు.  సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతూ, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొడ్డుమామిడి రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి.  

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంచాయతీరాజ్ రోడ్ల నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మారుమూల పల్లెలను సైతం ప్రధాన రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక్క బొడ్డుమామిడి అనే కాదు..  ఎన్నో గిరిజన, మారుమూల గ్రామాలకు ఈ నిధుల ద్వారానే నేడు రోడ్డు కనెక్టివిటీ లభిస్తోంది. 

ప్రస్తుతం బొడ్డుమామిడి గ్రామానికి నిర్మిస్తున్న మట్టి రోడ్డు పనులు పూర్తి కావస్తుండటంతో రానున్న రోజుల్లో రవాణా కష్టాలు చాలా వరకు తీరనున్నాయి. అయితే..  వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, భవిష్యత్తులో ఈ మట్టి రోడ్డును  తారు,  లేదా సిమెంట్ రోడ్డుగా మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసి తమకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Boddumamidi Village Road, Chandrababu Naidu, Pawan Kalyan, AP Rural Roads Development, Alliance Government AP

By
en-us Political News

  
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
జూలై 18 నాటి న్యూయార్క్ టైమ్స్ కనెక్షన్స్ పజిల్ గేమ్ 1133 హింట్స్ మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. మీ విన్నింగ్ స్ట్రీక్‌ను సులభంగా కాపాడుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.