ఏ పార్టీకీ పొలిటికల్ మైలేజీ దక్కనీయకపోవడమే కాక్రోచ్ ల విజయం.!

Publish Date:Jul 30, 2026

Advertisement

దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, రద్దుల చుట్టూ చెలరేగిన విద్యార్థుల ఆగ్రహజ్వాలలు చివరకు దేశ రాజధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి.  ఏ ఉద్యమమైనా సరే, విద్యార్థులు రోడ్డు మీదకు వస్తే ప్రభుత్వాల పునాదులు కదులుతాయని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కూదా దాదాపు అదే జరిగింది.  ప్రశ్నించే గొంతుకలపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లు, చివరికి కరెంట్ షాక్ ఇచ్చే బ్యాటన్లు వాడినా... యంగ్ ఇండియా ఇసుమంతైనా తగ్గలేదు.   వ్రస్థాయి నిరసనలు, విద్యార్థుల అకుంఠిత పోరాటం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది! అయితే దీని వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి?  విద్యాశాఖ మంత్రి రాజీనామా  నైతిక బాధ్యతతో చేశారా?   విద్యార్థి ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి వేసిన ఎత్తడగా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖను  పరిశీలిస్తే..  పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాననడం కాకుండా..  దేశద్రోహ శక్తులు  ఈ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే తాను పక్కకు తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు పరీక్షల లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైతే, న్యాయం కావాలని అడిగిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను  దేశద్రోహుల బీ-టీమ్ అని ప్రచారం చేయడమేంటి?

 అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ  అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే చెప్పాలి.  ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థి నాయకుల వయస్సు, ఉద్యోగంపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీక్షల రద్దు వల్ల వచ్చిన సమయాన్ని విద్యార్థులు మరింత ప్రిపేర్ అవ్వడానికి వాడుకున్నారనేలా వ్యాఖ్యానించడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 ప్రధాన్ స్థానంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. గతంలో బిల్కిస్ బానో కేసులోని ముద్దాయిల విడుదలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో  అధికిర కూగయొపై విరుచుకుపడ్డాయి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన కీలక సమయంలో, వివాదాస్పద నేపథ్యం ఉన్న నేతకు విద్యాశాఖను అప్పగించడంపై విద్యార్థి సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేలా ఒక కొత్త బిల్లును సిద్ధం చేస్తోంది. కానీ, ఈ తాత్కాలిక చట్టాలు, నాయకుల మార్పులు విద్యార్థుల నిరసనల తీవ్రతను తగ్గించగలవా? అంటే మాత్రం తగ్గించలేవనే సమాధానమే వస్తోంది. తమపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తేగల వ్యవస్థాత్మక మార్పులు కావాలని విద్యార్థిలోకం ఎలుగెత్తుతోంది. తాజాగా రైతుల ఆందోళనలకూ యువత సంఘీభావం ప్రకటించింది. 

మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది.   అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో  వెనకడుగు  వేసే ప్రశ్నేలేదని చాటింది.   ఆందోళనలను, ఉద్యమాలనూ అణచివేయడానికి అధికార పార్టీ, ప్రభుత్వం ఎన్ని వ్యూహాలురచించినా యువగళంముందు అవేవీ పారవని తాజా ఆందోళనలు నిర్ద్వంద్వంగారుజువుచేశాయి. ఇక ఈ ఉద్యమం సాధించిన మరో గొప్ప విజయం ఏమిటంటే.. ఏ రాజకీయ పార్టీకీ పొలిటికల్ మైలేజీ దక్కనీయకపోవడం. 

Dharmendra Pradhan Resignation, Student Unrest, Pralhad Joshi Education Minister, Paper Leak Controversy, BJP Strategy, politicalmilage,  TeluguOne

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.