ప్రెషర్ గ్రూప్ గానే బొద్దింకల పార్టీ.!

Publish Date:Aug 6, 2026

Advertisement

నీట్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై ఉద్యమించి విజయం సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ తన తదుపరి కార్యాచరణ  ప్రకటించింది. విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు సాధించడమే   ధ్యేయంగా జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించాలని  నిర్ణయించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికీ  రాజకీయ పార్టీగా మారబోదని స్పష్టం చేసింది.  కాక్రోచ్ జనతా పార్టీ ప్రెషర్ గ్రూప్ గా అంటే ఒత్తిడి బృందం గా మాత్రమే విద్యా వ్యవస్థ సంక్షేమం కోసం పని చేస్తుందని విస్ఫష్టంగా ప్రకటించింది. 

మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్‌లో   సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నివాసంలో ప్రతినిధులు, నిర్వాహకుల సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటన వెలువడింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ   భేటీలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, జాతీయ స్థాయి విస్తరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రజానుకూల, విద్యార్థి అనుకూల విధానాల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే   ప్రధాన వ్యూహంగా  ముందుకు సాగుతామని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. 

కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతుందన్న వార్తలను సీజేపీ నేత   అభిజిత్ దిప్కే ఖండించారు.  ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై పౌరులకు నమ్మకం సన్నగిల్లిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో  సమాజంలో నిజమైన మార్పు తెచ్చేందుకు ఇండిపెండెంట్ ప్రెషర్ గ్రూప్ గా నిలవడమే శ్రేయస్కరమని వెల్లడించారు. ఇతర సామాజిక, రాజకీయ వివాదాలలో జోక్యం చేసుకోకుండా కేవలం విద్యారంగానికి సంబంధించిన సమస్యలపైనే పూర్తి దృష్టి సారించాలని శంభాజీనగర్ భేటీలో తీర్మానించినట్లు పేర్కొననారు.  

వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలతో ఒక బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించాలని భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు.  దేశంలో ఎక్కడ విద్యార్థుల హక్కులకు భంగం కలిగినా, ఆందోళనలు జరిగినా వాటికి పూర్తి మద్దతుగా నిలుస్తామని దిప్కే చెప్పారు.  

 Cockroach Janata Party remains as pressure group,  Abhijit Dipke,  Education  Reforms, Exam Paper Leak Agitation, Student Pressure Group Network 

By
en-us Political News

  
జగన్ పర్యటనల్లో  వైసీపీ  కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
 ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర , భారతీయ విధానం అనే  అంశంపై  మోహన్ భగవత్   ప్రసంగిస్తారు.
శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని  డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ  ఎన్నికల  బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే  ఆ పిలుపును జనం ఖాతరు చేయలేదు. పీవోకే రాజధాని  ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా  మౌజమ్‌పూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో  గత కొన్ని రోజులుగా   ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  రహీస్ అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇల్లు  కుప్పకూలింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.