Publish Date:Oct 11, 2026
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆంక్షలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.శాంతిభద్రతల సమస్యలు లేదా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో తప్ప, మిగతా అన్ని చోట్లా ఏర్పాటు చేసిన బారికేడ్లను వెంటనే సమీక్షించి తొలగించాలని అధికారులను ఆదేశించింది. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప మెట్రో, రైల్వే సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదని తేల్చిచెప్పింది. ఈ సేవలను యథాతథంగా కొనసాగించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇటీవల జరిగిన నిరసనల కారణంగా అధికారులు పలు మెట్రో స్టేషన్లను మూసివేయడం, రవాణా వ్యవస్థను నియంత్రించడం జరిగాయి. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ప్రజలు, వాహనాల స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. చట్టసమ్మతమైన కారణాలు లేకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం తగదని హెచ్చరించారు.
శాంతియుతంగా సమావేశమయ్యే నిరసనకారులను ఎటువంటి సరైన కారణాలు లేకుండా అక్రమంగా నిర్బంధించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించింది.ఈ ప్రత్యేక విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తమ వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించామని, మెట్రో కార్యకలాపాలు కూడా సాధారణ స్థితికి వచ్చాయని కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, మెట్రో స్టేషన్ల మూసివేతపై మరింత స్పష్టత కోరింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-cockroach-janata-party-25-234045.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.