CII Summit: మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం.!

Publish Date:Nov 12, 2026

Advertisement

సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. 30 ఎంఓయులు, 5 జిఓల ద్వారా రూ. 1,57,607 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎపి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 

ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 52,956 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.  రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్ ఫ్రా, ఏరో స్పేస్, హెల్త్ కేర్, టూరిజం రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ 3 ఎంఓయుల ద్వారా రూ.39,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 12,940 ఉద్యోగావకాశాలు రానున్నాయి.

 

రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,500 కోట్లు,  క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.41వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలికం లిమిటెడ్ రూ.9,053 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయలు, జిఓ ఎక్స్చేంజిల వివరాలు ఇలా ఉన్నాయి.

తొలిరోజు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాల వివరాలు.!

1. రష్మీ మెటలర్జికల్ – రూ.18,500 కోట్లు పెట్టుబడి – 10,000 ఉద్యోగాలు
2. రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ – రూ.8,500 కోట్లు పెట్టుబడి – 800 ఉద్యోగాలు
3. రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ – 42 కోట్లు పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు
4. N.A.N మాగ్నెటెక్ – 3,000 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు
5. N.A.N సెలాక్స్ గ్రీన్‌మెట్ – 1,800 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
6. వెల్సపన్ గ్రూప్ – 2,500 కోట్లు పెట్టుబడి – 3,500 ఉద్యోగాలు
7. ఎవర్‌వోల్ట్ సోలార్ టెక్నాలజీ – 2,350 కోట్లు పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు
8. మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రా – 2,300 కోట్లు పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు
9. MEIL-ఎక్విప్‌మెంట్ స్కిడ్స్ – 1,100 కోట్లు పెట్టుబడి – 2,500 ఉద్యోగాలు
10. మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రా – 36,000 కోట్లు పెట్టుబడి - 8940 ఉద్యోగాలు

11. హీరో మోటర్ కార్ప్ – 1,457 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
12. పిఫైజర్ హెల్త్ కేర్ – రూ.983 కోట్లు పెట్టుబడి – 150 ఉద్యోగాలు
13. బ్లూజెట్ హెల్త్ కేర్ – 500 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు
14. ట్రైఫోస్ పవర్ – రూ.500 కోట్లు పెట్టుబడి – 200 ఉద్యోగాలు
15. రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ – 300 కోట్లు పెట్టుబడి – 300 ఉద్యోగాలు
16. రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ – 250 కోట్లు పెట్టుబడి – 300 ఉద్యోగాలు
17. సిటోటో డిజిటల్ పర్సనాలిటీ – 250 కోట్లు పెట్టుబడి - 230 ఉద్యోగాలు
18. ప్రీమియర్ ఎనర్జీస్ – 100 కోట్లు పెట్టుబడి - 75 ఉద్యోగాలు
19. డెల్టాక్స్ – 42 కోట్లు పెట్టుబడి - 110 ఉద్యోగాలు
20. క్లీన్ మాక్స్ ఇన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ – 41,000 కోట్లు పెట్టుబడి - 600 ఉద్యోగాలు

21. రేస్ పవర్ – 9,660 కోట్లు పెట్టుబడి – 500 ఉద్యోగాలు
22. రేస్ ఫ్యూయల్స్ – 3,000 కోట్లు పెట్టుబడి - 80 ఉద్యోగాలు
23. యునైటెడ్ టెలికామ్స్ – 9,053 కోట్లు పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు
24. MNL సొల్యూషన్స్ – 750 కోట్లు పెట్టుబడి - 500 ఉద్యోగాలు
25. క్లారస్ ఎనర్జీ – 100 కోట్లు పెట్టుబడి - 50 ఉద్యోగాలు
26. ఫ్యాబ్రిక్ – 4,300 కోట్లు పెట్టుబడి – 10,000 ఉద్యోగాలు
27. SLN కాఫీ – 2,500 కోట్లు పెట్టుబడి – 1,400 ఉద్యోగాలు
28. మానే గ్లోబల్ – 120 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు
29. డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ – 140 కోట్లు పెట్టుబడి - 140 ఉద్యోగాలు
30. ది పార్క్ హోటల్ – 115 కోట్లు పెట్టుబడి - 150 ఉద్యోగాలు

జీఓ ఎక్సేంజ్ ద్వారా ఒప్పందాలు.!

31. ఎం వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ – 3,078 కోట్లు పెట్టుబడి – 1,300 ఉద్యోగాలు
32. జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్స్ – 1,533 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు
33. ఓషిఆర్ గ్రీన్ ఫ్యుయిల్స్ – 616 కోట్లు పెట్టుబడి - 130 ఉద్యోగాలు
34. రెసల్వెన్ టూ ఎనర్జీ – 980 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు
35. గ్రాండ్ తిరుపతి హోటల్స్ & రిసోర్ట్స్ – 188 కోట్లు పెట్టుబడి – 851 ఉద్యోగాలు

మీకు నచ్చవచ్చు: అయ్యప్ప కటాక్షం వల్లే మాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు..శేఖర్ మాస్టర్ భావోద్వేగం.!

మీకు నచ్చవచ్చు: కేవలం రూ.100 పెట్టుబడి..కోటి రూపాయల వ్యాపారం సామ్రాజ్యంగా ఎదిగిన రైతు సక్సెస్ స్టోరీ.!

[ CII Partnership Summit Visakhapatnam, Nara Lokesh, Parag Sharma, Resolven Energy ]
 

By
en-us Political News

  
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ ప్రముఖ కృత్రిమ మేధ గ్రాఫిక్స్ దిగ్గజం ఎన్విడియా (NVIDIA) సంస్థలో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఊహించని రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని మదురైలో జరిగిన ఒక సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా న్యాయస్థానానికి హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో సరైన ఆలోచన, పట్టుదల ఉంటే ఏ విధంగా అద్భుతాలు సృష్టించవచ్చో ఒడిశాకు చెందిన ఓ యువ రైతు ఆచరణలో నిరూపించి చూపించారు.
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.