జనసేన గూటికి బొత్స కన్ ఫర్మేనా?
Publish Date:Aug 24, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది. ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది. ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు. బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics
http://www.teluguone.com/news/content/-botsa-satyanarayana-39-229697.html





